ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రుచి అమోఘం

ABN, Publish Date - May 30 , 2025 | 12:25 AM

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని కొమరగిరిలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద చెరువు ఉంది. ఇందులో సంవత్సరానికి ఒకసారే చేపలు పట్టుబడి పడతారు. పంచాయతీకి చెందిన ఈ చెరువును స్థానికంగా మకాం ఉండే పల్లీలు లీజుకు తీసుకుని చేపలు పండిస్తారు.

వస్తువులను తాకట్టు పెట్టయినా సరే కొనాల్సిందే

సంవత్సరానికి ఒకసారే పట్టుబడి

వింటే భారతం వినాలి... తింటే గారెలే తినాలి అనే సామెత పాతదైనా ఆ గ్రామానికి చెందిన చెరువు చేపను సంవత్సరానికి ఒకసారైనా తినాలనే కోరికతో కొత్తపల్లి మండల ప్రజలు ఉవ్విళ్లూరుతుంటారు. దాంతో చేపలు పట్టే రోజుకి చేతుల్లో డబ్బులు లేకపోయినప్పటికీ అప్పోసొప్పో చేసి లేక ఏదైనా వస్తువు తాకట్టుపెట్టి మరీ చేపలు కొనుగోలు చేయడం విశేషం.

కొత్తపల్లి, మే 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని కొమరగిరిలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద చెరువు ఉంది. ఇందులో సంవత్సరానికి ఒకసారే చేపలు పట్టుబడి పడతారు. పంచాయతీకి చెందిన ఈ చెరువును స్థానికంగా మకాం ఉండే పల్లీలు లీజుకు తీసుకుని చేపలు పండిస్తారు. ప్రతి సంవత్సరం జూన నెల దాటాక చెరువు చేపల్లో మంచివైన రాగండి, బొచ్చు, గడ్డి, చెరు వు సంధువాలు, ఎర్రమైల, వాలుగు తదితర రకాలకు చెందిన చేపల పిల్లలను వేస్తారు. మరలా మే నెల వచ్చే వరకు ఆ చెరువు వద్దకు పల్లీలు వెళ్లరు. అంతేగాక చేప పిల్లలకు ఎటువంటి ఆహారం వేయరు. చెరువులో ఉండే గడ్డి, నాచు, తూటికాడ, పొన్నగంటి కూరలను ఆహారంగా తింటాయి. సుమారు సంవత్సరం పాటు పెరిగిన చేపలు ఒక్కొక్కటి ఐదు నుంచి 8 కిలోల బరువు పెరుగుతాయి. వాటిని వారం లో రెండు లేక మూడు రోజులు పట్టుబడి పడతారు. కిలో రూ.130 చొప్పున తొలుత గ్రామ ప్రజలకు టోకెన్ల ద్వారా అమ్ముతారు. వారు వాటిని కొనుగోలు చేసి పొరుగూళ్లలో వున్న బంధువులు, స్నేహితులు, రాజకీయ ప్రముఖు లకు పంపిస్తారు. ఆ తర్వాత వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు కిలో రూ.150 చొప్పున విక్రయిస్తారు. ఎటువంటి మేత (ఆహారం) వేయకుండా కేవలం గడ్డి, తూటికాడ, పొన్న గంటి కూరలను మేతగా తిన్న చేపల రుచి అమోఘంగా ఉంటుందని ఇక్కడి ప్రజలు చెప్తు న్నారు. ఈ చేపలను వేపుడు లేదా పులుసు చేసుకుని మాంసాహాప్రియులు లొట్టలేసుకుని తింటారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు కొమరగిరి చెరువులో చేపలు ఎప్పుడు పడతారా అని బంధువులను ఆరా తీయడం గమనార్హం.

Updated Date - May 30 , 2025 | 12:25 AM