ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదర్శనీయుడు వీరేశలింగం

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:44 AM

నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులును ఆదర్శంగా తీసుకుని సమాజ హితం కోసం జీవించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. కోరారు. బుధవారం వర్శిటీలోని తెలుగుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కందుకూరి వీరేశలింగం జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి కందుకూరి చిత్రపటానికి నివాళులర్పించారు.

కందుకూరి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నన్నయ వీసీ
  • నన్నయ వీసీ ప్రసన్నశ్రీ

  • సంఘసంస్కర్త వీరేశలింగం జయంతి

  • పలువురి ఘన నివాళి

దివాన్‌చెరువు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులును ఆదర్శంగా తీసుకుని సమాజ హితం కోసం జీవించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. కోరారు. బుధవారం వర్శిటీలోని తెలుగుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కందుకూరి వీరేశలింగం జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి కందుకూరి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కందుకూరి సమాజ సంస్కరణకు చేసిన కృషినికొనియాడారు. తెలుగుశాఖలో కందుకూరి వీరేశలింగం, ఆదికవి నన్నయలను ఆప్షనల్‌ సబ్జెక్టులుగా చదువుతున్న విద్యార్థులు వారి ఔన్నత్యాన్ని ఇతరులకు తెలియజేసేవిధంగా ఎదగాలని సూచించారు. ఇటీవల రత్నసింహ్‌జీ మహీదా స్మారక అవార్డు అందుకున్న వీసీ ప్రసన్నశ్రీని తెలుగుశాఖ ఆధ్వర్యంలో అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌, ప్రిన్సిపాల్‌ డి.జ్యోతిర్మయి, తెలుగుశాఖ అధ్యాపకులు తలారివాసు, కేవీఎన్‌డీ వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఘనంగా నాటకరంగ దినోత్సవం

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): సంపూర్ణ జీవితాన్ని ఆవిష్కరించే కళ నాటకం అని ప్రముఖ నాటక కళాకారులు సీహెచ్‌ సుబ్రహ్మణ్యం అన్నారు. బుధవారం నాటకరంగ దినోత్సవాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాటకరంగం అనాదిగా ప్రజలకు కాలక్షేపానికే కాకుండా సమాజ మార్పునకు వేదిక అయ్యిందన్నారు. కందుకూరి నాటకం అవార్డు గ్రహీత డీఎస్‌పీ రావు మాట్లాడుతూ అర్ధ శతాబ్దంపైగా నాటకరంగమే ఊపిరిగా జీవించినవాళ్లం తాము అని, నాటకమే తమ ప్రాణమని అన్నారు. నాటక పరిశోధకుడు పీవీబీ సంజీవరావు, కళాకారిణి సురభి సువర్ణ మాట్లాడారు. హార్మోనియం నిపుణులు కలిగట్ల వెంకటరమణ కళాకారులు పాడిన పద్యాలకు లయబద్ధమైన సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు నాటకరంగ కళాకారులను సత్కరించారు. సభకు కళాశాల ప్రిన్సిపాల్‌ డీవీ రమణమూర్తి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ శరత్‌బాబు, వై.స్వర్ణశ్రీ, ఎస్‌.రాజ్‌కుమార్‌, పల్లి సుధా, జే.సుగుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:44 AM