ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నియామకం ఎప్పుడు?

ABN, Publish Date - Jun 24 , 2025 | 12:21 AM

ఆత్రేయపురం, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పాలకమండలి నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూ ర్తైయింది. ట్రస్టు

వాడపల్లి వెంకన్న ఆలయ పాలకమండలి ఏర్పాటులో తీవ్ర జాప్యం

అలానే ఉండిపోతున్న భక్తుల సమస్యలు

ఆత్రేయపురం, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పాలకమండలి నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూ ర్తైయింది. ట్రస్టు బోర్డు నియామకం ద్వారా బాధ్యతయుతంగా భక్తుల సమస్యలు పరిష్కరించడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులు చేపట్టడం, సిబ్బంది మధ్య విబేధాలు లేకుండా చూ డాల్సిన బాధ్యత ట్రస్టు బోర్డుపై ఉంది. ఆలయ అభివృద్ధి సమస్యలపై పాలకమండలి తీర్మానించి ఆ దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది. ట్రస్టు నియామకంలో కాలయాపన జరగడంతో పనులు ముందుకు సాగక భక్తుల సమస్యలు అలానే ఉ న్నాయి. గత కొన్నేళ్ల నుంచి స్వామివారి క్షేత్రం అశేష భక్తజనంతో అలరాలుతుం ది. వివిధ రా ష్ర్టాల నుంచి ప్రతి శనివారం 50 నుంచి 70 వేల మంది భక్తులు లెక్కకు మించి తరలివస్తున్నారు. భక్తులకు ఇంకా ఎన్నో మెరుగైన సౌకర్యాలు ఈ క్షేత్రంలో చేపట్టాల్సి ఉంది. గ్రేడ్‌ -1 స్థాయిలో ఉన్న ఈ ఆలయం 2023 డీసీలో హోదా దక్కి ంది. వార్షిక ఆదాయం రూ.25 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు చేరుకుంది. తొలి డిప్యూటి కమిషనరుగా భూపతిరాజు కిషోర్‌కుమార్‌ 8 నెలల పాటు బాధత్యలు స్వీకరించారు. అనంతరం కూటమి ప్రభుత్వం రాగానే ఉపకమినర్‌గా నల్లం సూర్యచక్రధరరావు నియమితులయ్యారు. డీసీ హోదా దక్కిన ఈ క్షేత్రానికి తొలిపాలక మండలి నియమించాల్సి ఉంది.

క్యాబినెట్‌లో చర్చ...

దినదినాభివృద్ధి చెందుతున్న వెం కన్న ఆలయ విశిష్టతపై రాష్ట్ర క్యాబినెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించినట్టు కోనసీమ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజారపు అచ్చెన్ననాయుడు ఇటీవల వాడపల్లి వెంకన్నను దర్శించుకుని విలేకర్లకు తె లిపారు. మాస్టర్‌ ప్రణాళిక ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామనే భావన చంద్రబాబు మదిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి ముఖ్య నేతలతో చైర్మన్‌, ధర్మకర్తల మండలి నియామకం కోసం రూపకల్పన చేశారు. ఆత్రేయపురం మండలానికి చెందిన క్షత్రియవర్గానికి చెందిన ఓ ముఖ్యనేతను చైర్మన్‌ పదవిని కట్టబెట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇ చ్చారు. బీజేపీ, జనసేన, బీజేపీ కూటమికి చెం దిన ధర్మకర్తలను ప్రతిపాదించి పార్టీ అధిష్టానానికి నివేదించారు.

ట్రస్టు బోర్డు

నియామకమిలా...

డీసీ హోదాకు చేరుకున్న ఈ క్షేత్రానికి 17 మంది ధర్మకర్తలు నియామకం కానున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల 9 మంది, ఓసీల నుంచి 8 మందిని ట్రస్టు బోర్డులో నియమించాల్సి ఉంది. అందులో 8 మంది మహిళలు ఉండాలి. ఒక బ్రాహ్మణ, నాయిబ్రాహ్మణ, ఎక్స్‌ఆఫీసియో సభ్యుడితో కలిపి 17 మంది ఉంటారు. వారంతా చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే 20 రోజుల్లోపు అర్హూల నుంచి దరఖాస్తు స్వీకరించి కమిషనర్‌కు నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ జీవో ద్వారా రెండేళ్ళ కాలపరిమితిలో ట్రస్టు నియామకం జరుగుతుంది. దేవదాయ శాఖ నిబంధనలకు అనుగుణంగా పాలకమండలి పనిచేయాల్సి ఉంది.

తీవ్ర పోటీ

రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రం చైర్మన్‌ పదవి రాష్ట్ర జాబితాలో చేర్చినట్టు సమాచారం. కోస్తాంధ్రలోని వివిధ జిల్లాల నుంచి ధర్మకర్తల మండలిలో స్థానం కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. కొంతమంది మంత్రు లు, ఎమ్మె ల్యేలు ట్రస్టు బోర్డులో స్థానం కోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:21 AM