vadapalli income
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:26 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంగళ వారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.
ఆత్రేయపురం, జూలై 8(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంగళ వారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారి ని దర్శించుకున్న అనంతరం భక్తజనం అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.3,25,158 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్య చక్రధరరావు తెలి పారు. వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన ఏలూరి ఎస్‌ఎస్ దివాకర్, సరళాదేవి దంపతులు రూ.1,05,001 విరాళం ఇచ్చారు. దాతలకు ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం అందజేశారు.
Updated Date - Jul 09 , 2025 | 12:26 AM