నేటి నుంచి వాడపల్లిలో పవిత్రోత్సవాలు
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:08 AM
ఆత్రేయపురం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలను వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమల తరహాలో సోమవారం నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఖండవిల్లి రాజేశ్వరవర
మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు
ఆత్రేయపురం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలను వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమల తరహాలో సోమవారం నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఖండవిల్లి రాజేశ్వరవరప్రసాదచార్యులు బ్రహ్మత్వంలో వేదపండితులు సకల దోశ పరిహార్ధం పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సో మవారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, దీక్షాధారణ, అకల్మస హోమం, సాయం త్రం అంకుర్పారణ, నవమూర్తి ఆవాహన, పంచసయ్యాదివాసం... మంగళవారం ఉదయం అష్టకళస స్థాపన, మహాశాంతిహోమం, సాయం త్రం పవిత్ర ఆరోహణ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం పవిత్ర విసర్జన, మహాపూర్ణాహుతి, కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొననున్నారు. ఉత్సవాలకు ఏ ర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఉపకమిషనర్, ఈ వో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో ప్రతిరోజు నిర్వహించే అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు, ఉపనయనాలు రద్దు చేయడం జరిగిందని, 7వ తేదీన యథావిథిగా కార్యక్రమాలు జరుగుతాయని ఈవో తెలిపారు.
Updated Date - Aug 04 , 2025 | 12:08 AM