వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం
ABN, Publish Date - May 04 , 2025 | 01:29 AM
ఆత్రేయపురం, మే 3(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆల యానికి శనివారం భక్తజనం పోటెత్తారు. వేకుమజామునే స్వా మివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐ శ్వర్యలక్ష్మిహోమం, భాలబో గం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి వివిధ రకాల పుష్పా
రూ.54.94 లక్షల ఆదాయం
ఆత్రేయపురం, మే 3(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆల యానికి శనివారం భక్తజనం పోటెత్తారు. వేకుమజామునే స్వా మివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐ శ్వర్యలక్ష్మిహోమం, భాలబో గం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలకరించారు. వివిధ రాష్ర్టాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి తీరువీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి మొ క్కులు తీర్చుకున్నారు. స్వా మివారిని దర్శించుకుని తులభారాలు, కానుకులు సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించా రు. అనంతరం రాత్రి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ సేవల ద్వారా స్వా మి వారికి ఒక్కరోజు రూ.54.94 లక్షల ఆదాయం లభించినట్టు ఉప కమిషనరు నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
వెండి కిరీటం బహూకరణ
వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తాడేపల్లిగూడెనికి చెందిన జి.జగదీష్ దంపతులు 250గ్రాములతో తయారు చేయించిన వెండి కిరీటాన్ని సమర్పించారు. ఆలయ ఈవో చక్రధరరావు దాతలకు స్వామి చిత్రపటం అందజేశారు.
Updated Date - May 04 , 2025 | 01:29 AM