ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అపరిష్కృత సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN, Publish Date - May 10 , 2025 | 12:22 AM

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు. శుక్రవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన ఓపెన్‌ఫోరంలో లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌), బిల్డింగ్‌ పెనలైజేషన్‌ స్కీం(బీపీఎస్‌)లపై వచ్చిన అర్జీలపై ఆరా తీసి చర్చించారు.

నగరంలో పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌
  • ఓపెన్‌ ఫోరంలో కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

రాజమహేంద్రవరం సిటీ, మే 9( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు. శుక్రవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన ఓపెన్‌ఫోరంలో లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌), బిల్డింగ్‌ పెనలైజేషన్‌ స్కీం(బీపీఎస్‌)లపై వచ్చిన అర్జీలపై ఆరా తీసి చర్చించారు. అనంతరం టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో సమీక్షించారు. అధికారులు, ప్లానింగ్‌ సెక్రటరీలు ప్రతిరోజు టెలీకాన్ఫరెన్స్‌లు తప్పనిసరిగా అనుసరించాలని, అప్పుడే చేసే పనిలో మంచిఫలితాలు వస్తాయన్నారు. ఆన్‌లైన్‌ అప్లీకేషన్స్‌ ఎక్కడా పెండింగ్‌ ఉండకూడదని సూచించారు. ప్లానింగ్‌ సెక్రటరీలు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిశీలన చేయాలన్నారు. నగరంలో అక్రమణలు తొలగింపు నిత్యం జరగాలని లేకపోతే నగరంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుందన్నారు. అలాగే ఏదైనా ప్రాంతంలో అనధికార ఫ్లెక్సీలు, బోర్డులు గుర్తిస్తే తక్షణమే తొలగించాలన్నారు. ప్లానింగ్‌ సెక్రటరీలు విధుల్లో ఏమాత్రం అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో సిటీ ప్లానర్‌ జి.కోటయ్య, ఏసీపీలు, టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

  • పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

స్థానిక ఏవీఏ రోడ్డు, రామాలయం సెంటర్‌, జేఎన్‌ రోడ్డు ప్రాంతాల్లో కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి ప్రతి రోజు చెత్త తరలింపుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైనేజీలు, రహదారులను శుభ్రంగా ఉంచాలని, తడి, పొడి చెత్తసేకరణను మరింత మెరుగ్గా నిర్వహించాలని చెప్పారు. కాలువల పూడిక తీత, సిల్ట్‌ ఎత్తివేత పనులు క్రమం తప్పకుండా జరగాలని అలాగే ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలన్నారు. పరిసరాలను పరిశుభ్రత ప్రతి ఒక్కరిబాధ్యత అని కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ పేర్కొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:22 AM