ఐక్యతతోనే సమూలంగా వివక్ష నిర్మూలన
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:12 AM
మాల, మాదిగ, రెల్లి ఉపకులాలు ఐక్యతతో వివక్షతను సములాంగా నిర్మూలించగలమని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. రాజమహేంద్రవరం ఆనంద్‌రీజెన్సీ పందిరి హాలులో ఆదివారం రాత్రి దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో చైర్మన్ కేఎస్ జవహర్ దంపతులకు పౌరసత్కారం చేశారు.
మాల, మాదిగ, రెల్లి ఉపకులాలు ఏకం కావాలి
పౌరసత్కార సభలో ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 29(ఆంధ్రజ్యోతి): మాల, మాదిగ, రెల్లి ఉపకులాలు ఐక్యతతో వివక్షతను సములాంగా నిర్మూలించగలమని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. రాజమహేంద్రవరం ఆనంద్‌రీజెన్సీ పందిరి హాలులో ఆదివారం రాత్రి దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో చైర్మన్ కేఎస్ జవహర్ దంపతులకు పౌరసత్కారం చేశారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ సమానత్వం కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదన్నారు. విద్య, ఉపాఽధి అవకాశాల్లో వెనుకబడి ఉన్నామని, మన పిల్లలు బాగా చదివించుకోవాలన్నారు. అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. సమాజంలో అసమానతలు తొలగిపోవాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అందులో భాగంగానే తనను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఎంపిక చేశారన్నారు. మాదిగ, మాల, రెల్లీ ఉపకులాలు కలిసి కట్టు గా వుండాలన్నారు. ముఖ్యఅతిథిగా వి చ్చేసిన మంత్రి కం దుల దుర్గేష్ మా ట్లాడుతూ ఎస్సీఎస్టీ హక్కుల పరిరక్షణ లో చైర్మన్ జవహర్ తనదైన శైలిలో ముందుకు సాగాలన్నారు. ఆయ నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విశిష్ట అతిథి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎ స్సీ, ఎస్సీ ఉపకులాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. చైర్మన్ జ వహర్‌కు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు,అనపర్తి ఎమ్మె ల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. జవహర్‌ను తొలుత కలిసి అభినందనలు తెలిపి వెళ్లారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ నుంచి ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌ను ఊరేగింపుగా దళిత ఐక్యవేదిక వద్దకు తీసుకొచ్చారు. మార్గం మధ్యం లో బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు జవహర్ పూలమాలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో మాదిగ, మాల కార్పొరేషన్ల డైరెక్టర్లు వేమగిరి వెంకటరావు, మద్ద మణి, దళి త ఐక్యవేదిక కన్వీనర్ బోయిలపల్లి సుందరయ్య, తాళ్లూరి బాబూ రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం, కాశి నవీన్‌కుమార్, కోరు మిల్లి విజయశేఖర్, నీలాపు వెంకటేశ్వరరావు, తాళ్ళూరి విజయకుమార్, చా పల చిన్నరాజు, తగరం సురేష్, ఖండవల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 12:12 AM