మరిడమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు
ABN, Publish Date - Jul 01 , 2025 | 01:33 AM
పెద్దాపురం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): భక్తిభావం ఉప్పొంగాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు హోరెత్తాయి. వాటిని అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో మరిడమ్మ జాతర సంద ర్భంగా స్థానిక చాపలవీధి సంబరం కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా
మద్యం మత్తులో విచక్షణ
కోల్పోయి కొట్టుకున్న యువకులు
భయభ్రాంతులకు గురైన ప్రజలు
నియంత్రించలేకపోయిన పోలీసులు
పెద్దాపురం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): భక్తిభావం ఉప్పొంగాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు హోరెత్తాయి. వాటిని అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో మరిడమ్మ జాతర సంద ర్భంగా స్థానిక చాపలవీధి సంబరం కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక దర్గా సెంటర్ ప్రాంతంలో భారీ స్టేజీ నిర్మి ంచి యువతులతో అశ్లీల నృత్యాల ప్రదర్శన ని ర్వహించారు. భారీ డీజే సాంగ్స్‌తో హోరెత్తిం చారు. దీంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడకు చే రారు. మద్యం తాగిన పలువురు యువకులు మ త్తులో జోగుతూ ఘర్షణలకు దిగారు. పరస్పరం ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేసుకున్నారు. సమీపంలో మద్యం దుకాణం ఉండడంతో పరిస్థితి మరీ భయానకంగా మారింది. అక్కడి వాతవరణం చూసి సంబరాన్ని తిలకించడానికి వచ్చిన ప్రజలు, మహిళలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ పరస్పర దాడుల్లో గాయపడిన యువకులను స్థానిక ఆసుపత్రికి తరలిస్తే అక్కడ సైతం వారు మత్తు లో ఘర్షణకు దిగి ఆసుపత్రిలో భయానక వాత వరణం సృష్టించారు. అశ్లీల నృత్యాల నిర్వహణకు స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లే కారణమని, అందుకే పోలీసులు వారికి తలొగ్గి అశ్లీల నృత్యాలు నియంత్రించకుండా అక్కడ ప్రేక్షకపాత్రకే పరిమి తమయ్యారని పలువురు చర్చి ంచుకుంటున్నారు. దీనిపై వి చార ణ చేసి సంబంధిత వ్య క్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jul 01 , 2025 | 01:34 AM