ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమాయకులు, పేదలే టార్గెట్‌!

ABN, Publish Date - Jun 07 , 2025 | 12:23 AM

కాకినాడ క్రైం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): అమాయకులు, పేద ప్రజలే వారి టార్గెట్‌. ఆధార్‌ కార్డు ద్వారా బ్యాంక్‌ ఖాతా తెరిచి సంబంధిత బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఏటీఎం కార్డ్‌, సిమ్‌కార్డ్‌ ఒక కిట్‌గా మాకు ఇవ్వడం ద్వారా మీకు లోన్‌లు, నెల కు రూ.5వేలు ఇస్తామని ఆశ చూపుతూ నమ్మబలికి తద్వారా ఆ కిట్లను అమాయ

కాకినాడలో అరెస్ట్‌ అయిన నిందితులను చూపుతున్న పోలీసులు

లోన్లు ఆశ చూపి

డబ్బు లాగేస్తున్న ఇద్దరి అరెస్ట్‌

రూ.కోట్లలో లావాదేవీలు

రూ.18 లక్షలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌

కాకినాడ క్రైం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): అమాయకులు, పేద ప్రజలే వారి టార్గెట్‌. ఆధార్‌ కార్డు ద్వారా బ్యాంక్‌ ఖాతా తెరిచి సంబంధిత బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఏటీఎం కార్డ్‌, సిమ్‌కార్డ్‌ ఒక కిట్‌గా మాకు ఇవ్వడం ద్వారా మీకు లోన్‌లు, నెల కు రూ.5వేలు ఇస్తామని ఆశ చూపుతూ నమ్మబలికి తద్వారా ఆ కిట్లను అమాయకుల వద్ద నుం చి తీసుకుని ఒకరి నుంచి మరొకరికి రూ.కోట్లలో లావాదేవీలు చేస్తున్న ముఠాను కాకినాడ జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జి. బిందుమాధవ్‌ వెల్లడించారు. ఇటీవల సైబర్‌ నేరాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో జిల్లా పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కాకినాడ సాంబమూర్తినగర్‌కు చెందిన కొర్రా లో వకృష్ణకు తన స్నేహితుల ద్వారా పరిచయమైన సామర్లకోట టిడ్కో అపార్ట్‌మెంట్స్‌కు చెందిన 37 ఏళ్ల నార్ని సతీష్‌చంద్ర అలియాస్‌ సతీష్‌ పరిచయమయ్యాడు. అనంతరం సతీష్‌ ద్వారా ఈ ఏడాది జనవరి 31న కాకినాడ వన్‌టౌన్‌ పరిధిలోని కర్ణాటక బ్యాంక్‌లో లోవకృష్ణతో అకౌంట్‌ ఓపెన్‌ చేయించి ఈ అకౌంట్‌ ద్వారా లోన్‌లు, ప్రతి నెల రూ.5 వేలు ఇప్పిస్తానని ప్రలోభపెట్టి లోవకృష్ణతో పాటు అతడి స్నేహితులతో కూడా అకౌంట్‌లు ఓపెన్‌ చేయించాడు. వారికి బ్యాంక్‌ అకౌంట్‌లపై పెద్దగా అవగాహన లేకపోవడం బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఏటీఎం కార్డ్‌, సెల్‌సిమ్‌కార్డ్‌, చెక్‌బుక్‌ కలిపి ఒక కిట్‌గా భావించి తన స్నేహితులకు సతీష్‌కు ఇచ్చాడు. అయితే కొన్ని రోజుల తరువాత సతీష్‌ను ఎన్నిసార్లు అడిగినా లోన్‌లు రావడం లేదని లోవకృష్ణకు చెప్పాడు. అలాగే ప్ర తి నెల ఇస్తానన్న రూ.5వేలు కూడా ఇవ్వక పోవడంతో సతీష్‌ను నిలదీయడంతో సరైన సమాధానం చెప్పకపోవడంతో లోవకృష్ణ కర్ణాటక బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీశాడు. అయితే తన అకౌంట్‌ ద్వారా సుమారు రూ.50 లక్షల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్టు గుర్తించి వెంటనే కాకి నాడ వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా డు. ఈ ఫిర్యాదుపై క్రైం నెం 140/2025 కేసు రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే ఎస్పీ సూచనలతో కాకినాడ ఎస్‌డీపీవో మనీష్‌దేవరాజ్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో కాకినాడ వన్‌టౌన్‌ లా అండ్‌ ఆర్డర్‌, కాకినాడ, పెద్దాపురం క్రైం పోలీసులను 3 ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

రూ.30 వేలకు కిట్ల అమ్మకాలు

అనంతరం సతీష్‌చంద్ర అలియాస్‌ సతీష్‌తో పాటు సామర్లకోటకు చెందిన 31 ఏళ్ల దాస రి వీర వెంకట సత్యనారాయణ ప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు. వారిద్దరూ కలిసి కాకినాడలో ఉండే ఉద య్‌కిరణ్‌కు ఈ కిట్లను రూ.30 వేలకు అమ్ముతున్నారు. ఉదయ్‌కిరణ్‌ 30ఏళ్ల క్రితం సామర్లకోట లో ఉండి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి గోవా లో క్యాసినోలో పని చేసి... తర్వాత దుబాయ్‌కి వెళ్లిపోయిన పుట్టా రామ్‌ అనే వ్యక్తికి ఈ బ్యాంక్‌ ఖాతాల కిట్లను అందజేస్తుండగా అక్కడ నుంచి రామ్‌ ఈ సైబర్‌ క్రైం దందా నడిపిస్తున్నాడు.

50 కిట్ల స్వాధీనం

ఈ విధంగా ప్రస్తుతానికి 50 మంది బ్యాంక్‌ ఖాతాల ద్వారా వచ్చిన 50 కిట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ లావాదేవీలు కేవలం 2,3 నెలలో జరిగినవే. ఈ ఖాతాల ద్వారా రూ.8.80 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఉదయ్‌కిరణ్‌ను, పుట్టా రామ్‌ను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని కాకినాడ ఎస్పీ వెల్లడించారు. కాగా బాఽధితులందరు ఉత్తరప్రదేశ్‌, వెస్ట్‌ బెంగాల్‌, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన వారు. ప్రస్తుతానికి నిందితుల నుంచి రూ. రూ.18లక్షలు స్వాధీనం చేసుకున్నామని, బాధితులను గుర్తించి వారికి అందజేస్తామని ఎస్పీ స్ప ష్టం చేశారు. అయితే నార్ని సతీష్‌ పాత నేరస్థుడని, అతడిపై పలు పోలీస్‌స్టేషన్‌లలో దొంగత నం కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమం లో అడ్మిన్‌ ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, కాకినాడ ఎస్‌డీపీవో మనీష్‌దేవరాజ్‌ పాటిల్‌, ఎస్‌బీ డీఎస్పీ సీహెచ్‌ శ్రీరామకోటేశ్వరరావు, క్రైం సీఐ వి.కృష్ణ, వన్‌టౌన్‌ సీఐ ఎం.నాగదుర్గారావు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 12:23 AM