కొన్న రెండ్రోజుల్లోనే రైతుల ఖాతాకు సొమ్ములు
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:42 AM
రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేయడం జరిగిందని, ధాన్యం విక్రయించిన రెండు రోజుల్లో రైతుల ఖాతాకు సొమ్ములు జమచేసే విధంగా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు.
కలెక్టర్ మహేష్‌కుమార్
అంబాజీపేట, ఏప్రిల్25(ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేయడం జరిగిందని, ధాన్యం విక్రయించిన రెండు రోజుల్లో రైతుల ఖాతాకు సొమ్ములు జమచేసే విధంగా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లిలో ఆయన రైతు కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి రైతు వారీగా కల్లాల్లో గోనె సం చుల్లో నింపుతున్న ప్రక్రియను ఆయన పరిశీలలించారు. గోనెసంచులు, సరఫరాపై ఆరా తీశారు. గోనెసంచుల్లో నింపిన ధాన్యం తేమ శాతం, నాణ్యత, తరుగు తదితర విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్‌కుమార్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాల ఇతర లైన్ డిపార్ట్‌మెంట్ల భాగస్వామ్యంతో ధాన్యం సేకరణ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. ధాన్యం నమూనాలను కొనుగోలు కేంద్రాలకు అందించి దానికి అనుగుణంగా గిట్టుబాటు ధరలను పొందాలని సూచించారు. రైతుల కష్టాన్ని దళారుల పాలు కాకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సమస్యలు తలెత్తినట్టయితే జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ సెల్ నెంబరు 8309432487, 9441692275 నెంబర్లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు.
Updated Date - Apr 26 , 2025 | 01:42 AM