ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సోదరుడి పిండ ప్రదానానికి పయనమై ప్రాణాలు విడిచిన సోదరులు

ABN, Publish Date - Apr 05 , 2025 | 12:40 AM

అంబాజీపేట, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): సోదరుడు మృతి తో ఆ ఇంట్లో విషాదం నెలకొన్న పది రోజులకే మరో విషాద కరమైన ఘటన జరిగింది. సోదరుడు దశదిన కర్మ కార్యక్రమాలు నిర్వహించి పిండ ప్రదానా నికి మోటార్‌సైకిల్‌ పై వెళ్తున్న అన్నదమ్ములను లారీ మృత్యురూపంలో కబళించింది. ఒకరు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా మరొకరు చికిత్స పొందు తూ మృతిచెందారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రా

ఘటనా స్థలం వద్ద సోదరులను ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యం

గంగలకుర్రులో విషాదంలో మరో విషాదం

లారీ ఢీకొని అన్నదమ్ముల మృతి

అంబాజీపేట, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): సోదరుడు మృతి తో ఆ ఇంట్లో విషాదం నెలకొన్న పది రోజులకే మరో విషాద కరమైన ఘటన జరిగింది. సోదరుడు దశదిన కర్మ కార్యక్రమాలు నిర్వహించి పిండ ప్రదానా నికి మోటార్‌సైకిల్‌ పై వెళ్తున్న అన్నదమ్ములను లారీ మృత్యురూపంలో కబళించింది. ఒకరు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా మరొకరు చికిత్స పొందు తూ మృతిచెందారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామానికి చెందిన మంగిపూడి సూర్యనారాయణ గత నెల 24న మృతిచెందాడు. అతడి దిన కార్యక్రమాన్ని సోదరులు మంగిపూడి రామచంద్రరావు(67) మంగిపూడి నాగరాజు(64)లు శుక్రవారం ఇంటి వద్ద నిర్వహించారు. అనంతరం కర్మ కార్యక్రమాలు నిర్వహించి వాటిని కౌశికలో (గ్రామ శివారున ఓ కాలువ) కలిపేందుకు మోటార్‌సైకిల్‌పై అన్నదమ్ములు బయలుదేరివెళ్లారు. ఆ ఇంటికి సమీపంలోని గంగలకుర్రు ప్రాథమిక పాఠశాల నాలుగురోడ్లు జంక్షన్‌లోకి వచ్చే సరికి ముక్కామల నుంచి అంబాజీపేట వైపు అతివేగం, నిర్లక్ష్యంతో వెళ్తున్నలారీ మోటార్‌సైకిల్‌ను బలంగా ఢీకొంది. దీంతో నాగరాజు తలకు తీవ్రగాయాలు, రామచంద్రమరావుకు బలమైన గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌ ద్వారా అమలాపురం ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో నాగరాజు మృతిచెందగా రామచంద్రరావు చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాగరాజుకు భార్య, కుమారుడు ఉన్నారు. నాగరాజు విజయవాడలో చార్టర్‌ అకౌటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఇన్‌కంట్యాక్స్‌ కార్యాలయంలో అధికారిగా పనిచేస్తున్నారు. కాగా రామచంద్రరావుకు వివా హం కాలేదు. సంఘ టనా స్థలాన్ని ఎస్‌ఐ కె.చిరంజీవి పరిశీలించారు. దిన కార్యక్రమం జరిగిన రోజే మరో విషాదం జరగడంతో గంగలకుర్రు లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుం బ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు చూ పరులను కలిచివేసింది. ప్రమాదానికి కారణ మై న లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. సీఐ రుద్రరాజు భీమరాజు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చిరంజీవి పేర్కొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:40 AM