ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాపం పండినట్టే!

ABN, Publish Date - May 18 , 2025 | 12:43 AM

ఆంధ్రజ్యోతి తొండంగి విలేకరి కాతా సత్యనారాయణ హత్య కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. న్యాయస్థానంలో ఈ కేసును సమర్థవంతంగా వాదించి నిందితులకు శిక్ష పడేలా చేయడానికి ప్రభుత్వం స్పెషల్‌ కౌన్సి ల్‌ను నియమించింది. గతంలో సీబీఐ తరఫున క్రిమినల్‌ కేసులు వాదిం

తొండంగి విలేకరి హత్యకేసు విచారణలో కీలక మలుపు

కేసులో సమర్ధ వాదనకు స్పెషల్‌ కౌన్సిల్‌గా మోహనమురళీని దించిన ప్రభుత్వం

సీబీఐ తరపున క్రిమినల్‌ కేసులు వాదించడంలో మురళీ దిట్టగా గుర్తింపు

జీవోఆర్టీ నెంబరు 771జారీ చేసిన రాష్ట్ర హోంశాఖ

ప్రభుత్వం మారడంతో ఇప్పటికే ఈ కేసును మళ్లీ లోతుగా విచారిస్తోన్న సీఐడీ

దాడిశెట్టి రాజా ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించి ఇప్పటికే ఏ1గా చేర్చేందుకు నిర్ణయం

అటు హత్యకు సంబంధించి పూర్తిగా లోతైన ఆధారాల సేకరణలో నిమగ్నం

హత్య అనంతరం నమోదు చేసిన చార్జిషీటూ తప్పులతడక

దీనివెనుక కారణాలపైనా దర్యాప్తు

త్వరలో పక్కా ఆధారాలతో కొత్తగా మరో చార్జిషీటు దాఖలకు ప్రయత్నం

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఆంధ్రజ్యోతి తొండంగి విలేకరి కాతా సత్యనారాయణ హత్య కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. న్యాయస్థానంలో ఈ కేసును సమర్థవంతంగా వాదించి నిందితులకు శిక్ష పడేలా చేయడానికి ప్రభుత్వం స్పెషల్‌ కౌన్సి ల్‌ను నియమించింది. గతంలో సీబీఐ తరఫున క్రిమినల్‌ కేసులు వాదించిన కాకినాడకు చెందిన న్యాయవాది మోహనమురళీని రంగంలోకి దించి ంది. ఈమేరకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసిం ది. అటు ఇప్పటికే ఈకేసులో రాజమహేంద్ర వ రం సీఐడీ విచారణలో స్పీడు పెంచింది. ప్రభు త్వం మారడంతో పాతకేసులో లోపాలను సరిది ద్ది మళ్లీ కేసు విచారణ చేపట్టింది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాత్రను నిర్ధారిస్తూ త్వరలో కొత్త చార్జిషీటు దాఖలకు సిద్ధమవుతోంది. మరోపక్క ఈ కేసులో తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు జారీచేయాలని రాజా హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం బెయిల్‌ తిరస్కరించింది.

కిరాతకంగా నరికించినా బయటే...

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొం డంగి మండలం ఆంధ్రజ్యోతి విలేకరిగా పని చేసిన కాతా సత్యనారాయణ 2019 అక్టోబరు 15న హత్యకు గురయ్యారు. విధులు ముగించు కుని ఇంటికి వెళ్తున్న సమయంలో రాత్రివేళ కొం దరు అగంతకులు అప్పటి తుని వైసీపీ ఎమ్మె ల్యేగా ఉన్న దాడిశెట్టి రాజా నివాసానికి దగ్గరలో లక్ష్మిదేవి చెరువు గట్టుపై మాటు వేసి సత్యనారాయణను హత మార్చారు. ద్విచక్రవాహనంపై ఎస్‌.అన్నవరంలోని తన నివాసానికి చేరుకునే క్రమంలో కిరాయి రౌడీలు మారణాయుధాలతో సత్యనారాయణను అతి కిరాతకంగా హతమార్చడం అప్పట్లో సంచలనమైంది. ఈ సంఘటనపై అప్పట్లో ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు తునిలో ఆందో ళనబాట పట్టాయి. ఈ హత్యకు వైసీపీ నేత దాడిశెట్టి రాజా సూత్రధారి అని మృతుడి కుటుంబసభ్యులు అప్పట్లో ఆరోపి ంచారు. పైగా హత్యకు కొన్ని రోజుల ముందు సెప్టెంబరులో తనకు రాజా అనుచరుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయంటూ ఆధారాలతో సత్యనారా యణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా రాజా ఒత్తిడితో పోలీసులు పట్టించు కోలేదు. అయితే సంచలనం రేకేత్తించిన ఈ కేసుపై తుని రూరల్‌ పోలీసులు అప్పుడు కేసు నమోదు చేసి దాడిశెట్టి రాజాతో పాటుగా ఆరుగురి నిందితులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అయితే అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న దాడిశెట్టి రాజా కేసును నీరుగార్చడంతో పాటు ఆయనతో పాటు కేసులో ఉన్న కొందరు అనుచరులను కేసు నుంచి బయటపడేసేందుకు తన అధికారం అడ్డం పెట్టుకున్నారు. కేసు నమో దైనా అరెస్ట్‌ అవకుండా అప్పటి అ ధికార పార్టీ పెద్దల ద్వారా పోలీసులపైఒత్తిడి తెచ్చారు.

హత్యతో సంబంధం లేదని బుకాయింపు

ఈలోపు దాడిశెట్టి రాజా కు మంత్రి పదవి లభిం చింది. దీంతో కేసు మరింత నీరుగారిపోయింది. అసలే రాజా మంత్రి కావడం తో అప్పటి పోలీసులు ఆయన జోలికి వెళ్లడానికి సాహసించలేదు. తెరవెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు కూడా ఉండడంతో 2023లో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ నుంచి మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా పేరును పోలీసులు తొలగించారు. అసలు రాజాకు హత్యతో సంబంధం లేదని బుకాయిం చారు. ఆర్థిక కారణాలతో హత్య జరిగిందంటూ కేసును తప్పుదోవ పట్టించి మమ అనిపించారు. దీనిపై న్యాయవాది అయిన సత్యనారాయణ సోదరుడు గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దా ఖలు చేశారు. రాజా పాత్రకు సంబంధించి ఆధా రాలు, పలుసార్లు రాజా అనుచరులు తన సోద రుడిని బెదిరించిన ఘటనలకు సంబం ధించిన వివరాలు న్యాయస్థానానికి అందించారు. అటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నారా లోకేశ్‌ యువగళం పాద యాత్రలో తుని వచ్చిన సమ యంలో సత్యనారా యణ కుటుంబ సభ్యులులో కేశ్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. రాజా తన అధికారాన్ని అడ్డం పెట్టు కుని కేసు లేకుండా చేసుకున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌ స్పందిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం చే స్తామని హామీఇచ్చారు. అనుకున్నట్లుగానే ప్రభుత్వం మారడంతో పోలీ సులు మళ్లీ హత్య కేసును తిరిగి తెరిచారు. ఆధా రాలున్నా సరే రాజాపై కేసు నమోదు చేయ కుండా అప్పటి పోలీసులు వ్యవహరించారని తేల్చారు. దీంతో కొన్నినెలల కిందట తిరిగి దాడిశెట్టి రాజాను పోలీసులు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఫలితంగా అరెస్ట్‌ తప్పదనే భయంతో రాజా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వా పరాలు పరిశీలించిన న్యాయ స్థానం రాజాకు ముందస్తు బెయిల్‌ నిరాకరించింది. పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే గతేడాది నవంబరులో ఈ కేసును ప్రభు త్వం సీఐడీకి అప్పగించింది. దీంతో రాజమ హేం ద్రవరం సీఐడీ డీఎస్పీ ఆఽధ్వర్యంలో ఈ కేసుపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. హత్యకు ముం దు తర్వాత జరిగిన పరిణామాలు, సత్యనారాయ ణకు వచ్చిన బెదిరింపులు, హత్య తర్వాత కేసు నమోదు, చార్జిషీటు దాఖలు వెనుక ఒత్తిళ్లు వీటన్నింటిపై లోతుగా దర్యాప్తు కొనసాగి స్తోంది. వీటన్నింటి క్రోడీకరించి పక్కా ఆధా రాలతో త్వరలో అరెస్ట్‌లు, కొత్తగా చార్జిషీటు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కేసులో లోతైన దర్యాప్తు జరిగితే తమకు ఉచ్చుబిగుసుకోవడం ఖాయమనే భయంతో కేసులో నిందితులు ఇటీవల హై కోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణ జరగకుండా స్టే కోరారు. దీన్ని వెకేట్‌ చేయిం చేందుకు అటుప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇక కేసు పరుగే..

కాతా సత్యనారాయణ హత్యకేసు విచారణకు సంబ ంధించి ప్రస్తుతం న్యాయస్థానంలో ప్రాసిక్యుషన్‌ తర ఫున వాదనలు అంత సమర్థవంతంగా లేవని బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తంచేస్తోంది. కేసు విచారణ లో తరచు ప్రభుత్వ న్యాయవాదులు మారుతుండడం తో అదేపనిగా విచారణలో కాలయాపన జరుగుతోం దని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ఆసమస్యలు లేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచా రణ వేగంగా జరిగి బాధితులకు న్యాయం జరిగేలా చేయడం కోసం ప్రత్యేకంగా స్పెషల్‌ కౌన్సిల్‌ను నియమించింది. జి.మోహన మురళీ అనే న్యాయవా దిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాకినాడకు చెందిన మురళీ గతంలో కాకినాడ మూడో జిల్లా కోర్టు ఏపీపీగా పనిచేశారు. ముంబైలో సీబీఐ పీపీగా అనేక క్రిమినల్‌ కేసులను సమర్ధవంతంగా వాదించారు. విలేకరి హత్య కేసు విచారణలో సమర్ధవంతంగా ప్రాసిక్యుషన్‌ వాదన వినిపించడం కోసం ప్రభుత్వం ఈయన్ను రంగంలోకి దించడం కేసు విచారణలో కీలక మలుపనే చెప్పాలి.

Updated Date - May 18 , 2025 | 12:43 AM