ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు, రేపు ఈసెట్‌

ABN, Publish Date - May 06 , 2025 | 02:04 AM

ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈసెట్‌) మంగళవారం, బుధవారాల్లో చెయ్యేరులోని శ్రీనివాసా ఇంజనీరింగ్‌, బీవీసీ కళాశాలల్లో సమర్థవంతగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ ఎన్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

అమలాపురం, మే5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈసెట్‌) మంగళవారం, బుధవారాల్లో చెయ్యేరులోని శ్రీనివాసా ఇంజనీరింగ్‌, బీవీసీ కళాశాలల్లో సమర్థవంతగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ ఎన్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో 2025 ఇం జనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ప్రవేశ పరీక్ష సన్నద్ధతపై సోమవారం ఆమె సమీక్షించారు. పాలిటెక్నిక్‌, డిప్లమో విద్యాభ్యాసం పూర్తిచేసిన విద్యార్థులు ఈ కామన్‌ ప్రవేశ పరీక్షకు అర్హులన్నారు. జిల్లాలో సుమారు 800 మంది ఈ ప్రవేశ పరీక్షకు హాజరు కానున్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు నేరుగా ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. చెయ్యేరులోని శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాల, భట్లపాలెంలోని బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలకు రెండు బ్యాచ్‌లుగా నిర్వహిస్తారని తెలిపారు. రెండు పరీక్షా కేంద్రాల్లో రెండు బ్యాచ్‌లకుగాను రోజుకు 400 చొప్పున రెండు రోజులు పరీక్షలు జరుగుతాయని, కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు, తాగునీరు, వసతి, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ఏర్పాటు, మెడికల్‌ క్యాంపుల నిర్వహణ వంటివి ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. విద్యార్థుల రాకపోకలకు అనుగుణంగా ఆర్టీసీ సౌకర్యాలు కల్పించాల్సిందిగా డీఆర్వో సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శాంతలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ కేవీఆర్‌ఆర్‌ రాజుతోపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు రామకృష్ణంరాజు, ఎ.కుమార్‌లు జేఎన్‌టీయూ తరపున పరిశీలకులుగా విజ యకుమారి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 02:04 AM