నేడే అఖిల భారత సమ్మె
ABN, Publish Date - Jul 09 , 2025 | 01:12 AM
దేశ కార్మికుల న్యాయమైన హక్కులను కాపాడేందుకు ఈ నెల 9న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీఎన్ పూర్ణిమరాజు అన్నారు. ఈ మేరకు మంగళవారం దివాన్‌చెరువులో పంచాయతీ వద్ద పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను బానిసలుగా చేయడమే కేంద్ర ప్రభుత్వం చర్య అని ఆరోపించారు.
విజయవంతం చేయండి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి పూర్ణిమరాజు
దివాన్‌చెరువు/రాజమహేంద్రవరం రూరల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): దేశ కార్మికుల న్యాయమైన హక్కులను కాపాడేందుకు ఈ నెల 9న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీఎన్ పూర్ణిమరాజు అన్నారు. ఈ మేరకు మంగళవారం దివాన్‌చెరువులో పంచాయతీ వద్ద పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను బానిసలుగా చేయడమే కేంద్ర ప్రభుత్వం చర్య అని ఆరోపించారు. దీనిని కేంద్రకార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని, లేబర్ కోడ్లను రద్దుచేయాలని, రోజుకు ఎనిమిది గంటలు పని దినాన్ని దెబ్బ తీసే చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘ నాయకుడు పులగుర్త సాయిబాబా ఓ ప్రకటనలో మాట్లాడుతూ కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ 9న కేంద్ర కార్మిక సం ఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా సంయుక్త కిసాన్‌మోర్చా, దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ బంద్‌కు పిలుపునిచ్చాయన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఖాతాలు, వేల కోట్ల బడ్జెట్ నిధులు, డిపాజిట్ల నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు బ్యాంకులకు బదిలీ అయ్యాయన్నారు.ఈ నేపథ్యంలో సమ్మెను జయప్రదం చేయాలని సాయిబాబా పిలుపునిచ్చారు.
బ్యాంకు ఉద్యోగుల ధర్నా
రాజమహేంద్రవరం అర్బన్, జూలై 8(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఈనెల 9న చేపట్టబోయే సార్వత్రిక సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు యూనియన్లు ఏఐబీఈఏ బీఈఎఫ్‌ఐ, ఏఐబీఓఏ పాల్గొంటున్నారని జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మీపతిరావు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం రాజమహేంద్రవరంలోని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీపతిరావు మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, బ్యాంకులు, ఎల్‌ఐసీ, బీమా, ప్రైవేట్‌పరం కాకుండా ఆపాలని, బ్యాంకుల్లో అన్ని కేడర్లలో నియామకాలు జరపాలని, తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీమా జీఎస్‌టీ రద్దు చేయాలని, సామాన్య ఖాతాదారులకు సర్వీస్ ఛార్జీలు తగ్గించాలన్నారు. బుధవారం శ్యామలా థియేటర్ ఎదురుగా డీసీసీబీ వద్ద ధర్నా చేస్తామని ఆయన తెలిపారు. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్వాతి, ఉమారాణి, మురళీధర్, సూర్య, శివరామకృష్ణ, రమేష్, సోమరాజు, అప్పారావు, రాంబాబు, రవిచంద్ర, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 01:12 AM