ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెరుపులు, ఉరుములొస్తే పిడుగులే

ABN, Publish Date - May 01 , 2025 | 12:42 AM

సామర్లకోట, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఆకాశంలో నల్లని మబ్బులు, మెరుపులు, ఉరుములు కనబడితే పిడులు పడే అవకాశం ఉంటుందని ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచిస్తోంది. అంతేకాదు ప్రతీ సెల్‌ ఫోన్‌కు పిడుగుల సమాచారాన్ని అందిస్తూ ప్రజలను కూడా అ

ప్రజలను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచనలు

సామర్లకోట, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఆకాశంలో నల్లని మబ్బులు, మెరుపులు, ఉరుములు కనబడితే పిడులు పడే అవకాశం ఉంటుందని ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచిస్తోంది. అంతేకాదు ప్రతీ సెల్‌ ఫోన్‌కు పిడుగుల సమాచారాన్ని అందిస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. పిడుగుపాటు సంకేతాలు, పిడుగులు పడే ప్రదేశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనుల వివరా లను ప్రజలకు వివరిస్తూ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ప్రజ లను చైతన్యం చేస్తోంది. ప్రతీ ఏటా ఏప్రిల్‌ నెల నుంచి మే నెలాఖరు వరకూ సాయంత్రం పూట ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడి మనుషులు, జంతువులకు ప్రాణనష్టం జరిగే అవకాశముంది. దీనిపై పలు సూచనలు, జాగ్రత్తలను వివరిస్తున్నారు.

చేయకూడనివి

ఆరుబయట ప్రదేశాల్లో ఉండకూడదు.

ఆశ్రయం కోసం చెట్ల కిందకు వెళ్లకూడదు.

నీటిలో ఉండకూడదు, లోహపు పైపుల నుంచి వచ్చే నీటిని తాకకూడదు.

సెల్‌ఫోన్‌ ఉపయోగించరాదు, రేకుల షెడ్ల కింద, వరండాలలో ఉండరాదు.

ఉరుములు, మెరుపులు తదుపరి కనీసం 30 నిమిషాల వరకూ బయటకు వెళ్లరాదు.

ఎలక్ట్రిక్‌ ఉపకరణాలు, వ్యవసాయ పంపుసెట్లు ఉపయోగించరాదు.

ట్రాక్టర్లు, మోటారు సైకిళ్లను ఆరుబయట ఉంచరాదు.

పిడుగులు పడే ప్రదేశాలు

ఎత్తయిన ప్రదేశాలు, కొండప్రాంతాలు, పొడవైన చెట్లు, విద్యుత్‌, టెలీఫోన్‌ స్తంభాలు, టవర్‌లైన్లు, సెల్‌ ఫోన్‌ టవర్లు, విడివిడిగా ఉంటే ప్లాట్లు, ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడేందుకు ఆస్కారముంటుంది.

పిడుగుపాటుకు సంకేతాలు

ఆకాశంలో నల్లని మబ్బులు గుమికూడడం, మెరుపులు, ఉరుములు, వేగంగా గాలులు వీయడం వంటివి పిడుగుపాటుకు సంకేతాలుగా భావించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

టీవీ, రేడియోల ద్వారా వాతావరణ సమాచారాన్ని తెలుసుకుని స్థానిక హెచ్చరికలు పాటించాలి.

బహిరంగ ప్రదేశాల్లో ఉన్నపుడు మోకాళ్ల మధ్య తల వంటి చేతులతో చెవులను మూసు కుని భూమికి తగలకుండా వంగి కూర్చోవాలి.

గోడలు, ద్వారాలు, కిటికీలకు దూరంగా ఉండాలి.

ఎండిన చెట్లు, విరిగిన కొమ్మలకు దూరంగా ఉండాలి. వాహనాల్లో ప్రయాణించే వారు వాటిని సురక్షిత ప్రాంతాల్లో నిలిపి అందులోనే కూర్చోవాలి.

పశుసంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.

Updated Date - May 01 , 2025 | 12:42 AM