ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మరో విషాదం

ABN, Publish Date - May 28 , 2025 | 12:59 AM

ఆ కన్నీళ్లు ఇంకా ఆరనేలేదు.. మృతదేహాలు లభ్యంకాలేదు.. గోదావరిలో మరో విషాదం నెలకొంది.. మరో ముగ్గురు బాలురు గల్లంతవ డంతో తీవ్ర విషాదం నెలకొంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక దిగువున ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతం రావిలంకలో గత ఐదు రోజులుగా ఐదుగురు యువకులు స్నానాలు చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన రావిలంకలో అధికారులు
  • గోదారిలో ముగ్గురు బాలురు గల్లంతు

  • అందరూ కోనసీమ జిల్లావాసులే

  • ఆచంట మండలం రావిలంకలో ఘటన

పి.గన్నవరం, మే 27(ఆంధ్రజ్యోతి): ఆ కన్నీళ్లు ఇంకా ఆరనేలేదు.. మృతదేహాలు లభ్యంకాలేదు.. గోదావరిలో మరో విషాదం నెలకొంది.. మరో ముగ్గురు బాలురు గల్లంతవ డంతో తీవ్ర విషాదం నెలకొంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక దిగువున ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతం రావిలంకలో గత ఐదు రోజులుగా ఐదుగురు యువకులు స్నానాలు చేస్తున్నారు. యథావిధిగా మంగళవారం ఐదు గురు బాలురు స్నానానికి వెళ్లగా ముగ్గురు గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు బయటపడ్డారు. నాగుల్లంక శివారు గౌతమ్‌ నగర్‌కాలనీకి చెందిన కేతా ప్రవీణ్‌(15), సానబోయిన సూర్యతేజ(12), పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మం డలం పెదలంక గ్రామానికి చెందిన నీతిపూడి పౌల్‌కు మార్‌(15)లతోపాటు మరో ఇద్దరు బాలురు రావిలంకలో ఉన్న వశిష్ఠ నదీపాయలో స్నానానికి దిగారు. వారిలో ప్రవీణ్‌, సూర్యతేజ, పౌల్‌కుమార్‌ గల్లంతు కాగా మిగిలిన ఇద్దరు భయంతో అక్కడ నుంచి వెళ్లిపోతూ దారిలో కొందరికి సమాచారం ఇచ్చారు.ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌ ఆధారంగా తండ్రి వెంకటేశ్వరరావుకు స్థానికులు సమాచారం అందిం చారు. వెంకటేశ్వరావుతో పాటు సూర్యతేజ తండ్రి ఏడు కొండలు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రవీణ్‌, పౌల్‌ కుమార్‌లు ఇటీవలే పదవతరగతి పాస్‌ కాగా సూర్యతేజ 8వ తరగతి చదువుతున్నాడు. పౌల్‌కుమార్‌ తండ్రి మూడేళ్ల కిందట ప్రమాదంలో మృతిచెందగా తల్లి మహాలక్ష్మి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటుంది. సోదరి దుర్గాభవాని ఉంది. పౌల్‌కుమార్‌ నానమ్మ సత్యవతి సంరక్షణలో ఉంటున్నాడు. మూడు కుటుంబాలకు వీరంతా ఒక్కొక్కరే కాగా పౌల్‌ కుమార్‌కు సోదరి ఉంది. పౌల్‌కుమార్‌ వేసవి సెలవుల నిమిత్తం నెల రోజులు కిందట సూర్యతేజ ఇంటికి వచ్చాడు. ఘటనాస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పరిధిలో ఉన్నప్పటికీ గల్లంతైన బాలురది కోనసీమ కావడంతో స్థానిక అధికారులు చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అక్కడకు చేరు కుని అధికారులతో మాట్లాడారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.

Updated Date - May 28 , 2025 | 12:59 AM