ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వయసు 33.. చోరీలు 80

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:41 AM

చోరీలు చేయడంలో అతను సిద్ధహస్తుడు.. ఎందుకంటే..అతని వయసు 33.. చోరీలు 80... అంతర్రాష్ట్ర దొంగగా ముద్ర.. ఇదీ విశాఖ పట్నం జిల్లా గాజువాక మండలం సింహగిరి కాలనీకి చెందిన బులా నాగసాయి నేరచరిత్ర..17 ఏళ్ల వయసులోనే చోరీల బాటపట్టాడు..

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో ఇద్దరు

43 లక్షల సొత్తు స్వాధీనం

సిబ్బందికి ఎస్పీ ప్రశంస

రాజమహేంద్రవరం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : చోరీలు చేయడంలో అతను సిద్ధహస్తుడు.. ఎందుకంటే..అతని వయసు 33.. చోరీలు 80... అంతర్రాష్ట్ర దొంగగా ముద్ర.. ఇదీ విశాఖ పట్నం జిల్లా గాజువాక మండలం సింహగిరి కాలనీకి చెందిన బులా నాగసాయి నేరచరిత్ర..17 ఏళ్ల వయసులోనే చోరీల బాటపట్టాడు.. చోరీలు చేయడంలో ప్రావీణ్యత సాధించాడు. రాజమ హేంద్రవరం ప్రకాశం నగర్‌ పోలీసులు అంత ర్రాష్ట్ర దొంగ ఆటకట్టించారు.సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ కె.రమేశ్‌ బాబు సోమవారం వివ రాలు వెల్లడిం చారు. పలు కేసుల దర్యాప్తులో భాగంగా పాత నేరస్తుల చిట్టావిప్పితే అం దులో బులా నాగ సాయిపై అనుమానం వచ్చిందన్నారు.ఈ మేరకు అతని స్నేహితుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమ వరానికి చెందిన మహ్మద్‌ సోనూ ఆలీ అహ్మద్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అస లు విషయం బయటపడిందన్నారు. బులా నాగ సాయి 2007 నుంచీ దొంగతనాలు చేస్తున్నాడని తెలిపాడన్నారు. నాగసాయి దొంగిలించిన సొత్తు ను అహ్మద్‌ఖాన్‌ కొనుగోలు చేయడం, దొంగత నాల్లో సహకరించడం చేస్తాడన్నారు. నిందితు డిపై గాజువాక, వైజాగ్‌, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరు, ఒంగోలు, అత్తిలి, తణుకు, తాడే పల్లిగూడెం, కావలి, బెంగళూరు ప్రాంతాల్లో 80 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. గాజువాక పీఎస్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉందన్నారు.ఇటీవల రాజ మహేంద్రవరం ప్రకా శంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో నాగసాయి, అహ్మద్‌ ఖాన్‌ని సోమవారం అరెస్టు చేసి సుమారు రూ.43 లక్ష లు విలువైన 465 గ్రాముల బంగారు ఆభర ణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేది ంచిన సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌,ఎస్‌ఐ జి.సతీష్‌, హెచ్‌సీ వి.నాగరాజు, క్రైమ్‌ పీసీలు కె.ప్రదీప్‌ కుమార్‌,ఎస్‌.వీరబాబు, వి.దుర్గాప్రసాద్‌, వి.శివ ప్రసాద్‌లను ఎస్పీ అభినందించారు.

Updated Date - Jun 17 , 2025 | 12:41 AM