పెల్లుబికిన ఆగ్రహం
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:25 AM
రాజధాని అమరావతిపై అసభ్య పదజాలంతో సాక్షి న్యూస్ చానల్‌లో జరిగిన ఓ డిబేట్‌లో వ్యాఖ్యలు చేసిన కేఎస్‌ఆర్, కృష్ణంరాజులపై ఆగ్రహం పెల్లుబికింది. దీంతో ఆదివారం పలుచోట్ల తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పో లీసులకు ఫిర్యాదులు చేశారు.
అమరావతిపై వ్యాఖ్యలకు నిరసన
పలుచోట్ల తెలుగు మహిళల ధర్నా
పోలీసులకు ఫిర్యాదులు
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 7(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై అసభ్య పదజాలంతో సాక్షి న్యూస్ చానల్‌లో జరిగిన ఓ డిబేట్‌లో వ్యాఖ్యలు చేసిన కేఎస్‌ఆర్, కృష్ణంరాజులపై ఆగ్రహం పెల్లుబికింది. దీంతో ఆదివారం పలుచోట్ల తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పో లీసులకు ఫిర్యాదులు చేశారు. రాజమహేంద్రవరంలో తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు కోసూరి చం డీప్రియ, పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు మాలే విజ యలక్ష్మి ఆధ్వర్యంలో స్థాని క సెంట్రల్ జోన్ డీఎస్పీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. డీఎస్పీ రమేష్‌బాబుకు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై వ్యాఖ్య లు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిని వేశ్యల రాజధాని అని, ఎయిడ్స్ రోగుల కేంద్రమని అనడం సబబు కాదన్నారు. అమరావతిని కూటమి ప్రభుత్వం భావించి ప్రపంచ స్థాయిలో అభివృద్ధికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని చెప్పారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి మహిళలను జగన్ అప్పట్లో రోడ్డెక్కించారని తమకు జరిగిన అన్యాయంపై ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నంగా పాదయాత్ర చేస్తే అడుగడునా అడ్డుకున్నారన్నారు. ఇప్పుడు అమరావతి మహిళలను వేశ్యలుగా మాట్లాడటం జర్నలిస్ట్ వృత్తికే కళంకమన్నారు. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అనంతరం వారంతా రాజానగరం సాక్షి యూ నిట్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నాచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, తెలుగు మహిళలు తురకల నిర్మల, మీసాల నాగమణి, బోను ఈశ్వ రి, గొర్రెల రమణి, దొంగ నాగమణి, నాగలక్ష్మి, శ్రీలత, బూరా కల్పన, తుల్లి పద్మ, మోతానాగలక్ష్మి, కనకదుర్గ, నాయకులు చింత జోగి నాయు డు, శనపతి సత్తిబాబు, వీరా రాము, కిలౄపర్తి నాగభూణం, మహిళలు పాల్గొన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 12:25 AM