ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

10న టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభం

ABN, Publish Date - Jun 08 , 2025 | 01:15 AM

యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల ద్వారా ప్రతిపాదించే నూతన ఆవి ష్కరణలకు ఆర్థిక, సాంకేతిక చేయూత ఇవ్వ డానికి రతన్‌టాటా ఇన్నో వేషన్‌ హబ్‌ (ఆర్టీహెచ్‌) కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు.

ముస్తాబవుతున్న టాటా ఇన్నోవేషన్‌ కేంద్రం

రాజమహేంద్రవరం, జూన్‌7(ఆంధ్రజ్యోతి): యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల ద్వారా ప్రతిపాదించే నూతన ఆవి ష్కరణలకు ఆర్థిక, సాంకేతిక చేయూత ఇవ్వ డానికి రతన్‌టాటా ఇన్నో వేషన్‌ హబ్‌ (ఆర్టీహెచ్‌) కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. రాజమ హేంద్రవరం రూరల్‌ బొమ్మూరులో అందంగా తయారు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాల యంలో కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలి పారు.ఈ కేంద్రాన్ని ఈ నెల 10న సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభిస్తారన్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కాటంనేని భాస్కర్‌, పీఎస్‌ ప్రద్యుమ్న జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో శనివారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ ఆర్టీహెచ్‌కు లీడ్‌ పార్టనర్‌గా గ్రీన్‌కో ఉందన్నారు. ఈ హబ్‌ కోసం ఐదుగురు ప్రతినిధులు, ఇద్దరు స్వత్రం త నిపుణులతో ప్రమోషన్‌ కోసం టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, పరిశ్రమ నిర్వాహకుల సం ఘాల నుంచి ఇద్దరు ప్రముఖులను ఆహ్వాని స్తున్నట్టు చెప్పారు. దిశ, పాలనను పర్యవేక్షించే బాధ్యత, పెట్టుబడి, ఫైనాన్సింగ్‌ భాగస్వామ్యం,ఇంక్యుబేషన్‌, అండ్‌ యాక్సి లరేషన్‌, వాటాదారుల నిర్వహణ విషయంలో తగిన మార్గదర్శకం ఉండేలా హబ్‌ కార్య కలాపాలు ఉంటాయన్నారు.ఈ హబ్‌ ఏర్పాటు, నిర్వహణ విషయంలో సహ భాగస్వామ్యం, కార్పస్‌ ఫండ్‌ రూ.30కోట్లతో వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారని చెప్పారు.

Updated Date - Jun 08 , 2025 | 01:15 AM