ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా తలుపులమ్మ జాతర

ABN, Publish Date - Apr 27 , 2025 | 12:11 AM

తుని రూరల్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానంలో గంధ అమా వాస్యను పురస్కరించుకుని అమ్మ వారి వార్షిక జాతర వైభవంగా జరిగింది. దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతర వేడుకల్లో శనివారం చివరిరోజున పెద్ద ఎత్తున భక్తు లు హాజర

జాతరలో కేరళ నృత్యాలను ప్రారంభిస్తున్న ఈవో

నమూనా ఆలయంలో పూజలు

సాంస్కృతిక కార్యక్రమాలు, కేరళ నృత్యాలు

తుని రూరల్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానంలో గంధ అమా వాస్యను పురస్కరించుకుని అమ్మ వారి వార్షిక జాతర వైభవంగా జరిగింది. దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతర వేడుకల్లో శనివారం చివరిరోజున పెద్ద ఎత్తున భక్తు లు హాజరయ్యారు. లోవ దిగువున లోవ కొత్తూరు గ్రామంలో నిర్వహించే ఈ వేడుకను పురస్కరించుకుని నమూనా ఆలయంలో అమ్మవారికి ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కేరళ నృత్యాలను లోవ దేవస్థానం ఈవో విశ్వనాధరాజు ప్రారంభించారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా రూరల్‌ సీఐ చెన్నకేశవ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం లోవ కొత్తూరు గ్రామంలో అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఈవో తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు.

Updated Date - Apr 27 , 2025 | 12:11 AM