ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమ్మకు..అందలమే!

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:55 AM

చంద్రబాబు సూపర్‌సిక్స్‌ హామీల అమలుకు పట్టు దలతో ఉన్నారు.. ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. తాజాగా గురువారం తల్లికి వందనం హామీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం బ్యాంకులకు నగదు జమచేసింది.

రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ పాఠశాలలో తొలిరోజు ఆనందం

నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

ఇక తల్లుల ఖాతాలకు జమ

విద్యార్థులు 5.88 లక్షలు

ఉమ్మడి జిల్లాకు రూ.882 కోట్లు

జూలై 5 వరకు అమలు

విమానప్రమాదంతో ఆలస్యం

కూటమి పండుగ వాయిదా

ఆందోళన వద్దు : కలెక్టర్‌

(రాజమహేంద్రవరం/ అమలాపురం-ఆంధ్రజ్యోతి)

చంద్రబాబు సూపర్‌సిక్స్‌ హామీల అమలుకు పట్టు దలతో ఉన్నారు.. ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. తాజాగా గురువారం తల్లికి వందనం హామీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం బ్యాంకులకు నగదు జమచేసింది. దీంతో శుక్రవారం సాయంత్రానికి తల్లికి వందనం అమలయ్యే సూచన లు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఫోన్‌ తల్లికి వంద నం మెసేజ్‌లతో ట్రింగ్‌ట్రింగ్‌ అంటూ మోగుతుందని నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినప్పటికీ ఈ ప్రక్రియ ఈ నెల 12 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగేలా మార్గదర్శకాలు విడుదల చేశారు. తొలి విడతగా రెండో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు తల్లికి వందనం వర్తింపచేయనున్నారు. అయితే ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు మాత్రం వారి అడ్మిషన్లు పూర్తయ్యాక జమ చేస్తారు.

తల్లిదండ్రుల ఎదురుచూపులు..

తల్లికి వందనం డబ్బులు గురువారం ఖాతాల్లో జమవుతాయని కాకినాడ, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాతోపాటు తూర్పుగోదావరి, ఏజెన్సీల్లోని లబ్ధిదారు లు ఎదురుచూశారు. ఎన్నికల్లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఎందరున్నా ఇస్తారని అనుకున్నారు. గురు వారం రాత్రి వరకూ ఫోన్‌కు మెసేజ్‌ వస్తుందని చాలామంది చూస్తూనే ఉన్నారు. మరికొందరు సాం కేతిక ఇబ్బంది అయి ఉంటుందని సచివాలయాలకు వెళ్లారు. వాళ్లు సొమ్ములు పడతాయని చెప్పడం తప్ప కానీ సమాచారం లేదు. ఈనెల 12తో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఆ వేడు కల్లో తల్లికి వందనం లబ్ధిదారులను భాగస్వాములను చేద్దామని ప్రభుత్వం భావించింది. కానీ అహ్మదా బాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోవడంతో 242 మంది మృత్యువాత పడ్డారు. ప్రాణాల కంటే వేడుకలు ముఖ్యం కాదని భావించిన ప్రభుత్వం వేడు కలను వాయిదా వేసింది. దీంతో తల్లికి వందనం సొ మ్ము పడడం కాస్త అలస్యమవుతోందని సమాచారం.

అనుకోని ఘటనతో..

లబ్ధిదారుల వివరాలు సచివాలయాల సంక్షేమ అసి స్టెంట్ల లాగిన్‌కి చేరుకున్నాయి. ఆ మేరకు శుక్రవారం నుంచి అమలు మొదలు అవుతోందని చెబుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తూర్పుగోదావరి కలెక్టర్‌ ప్రశాంతి పేర్కొన్నారు. తల్లికి వందనం డబ్బులు ఆయా తల్లుల ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో జమ చేయనున్నారు. జిల్లాలోని లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తి చేశారు. అయితే అనుకోని విపత్తు సంభవించడంతో రెండు రోజుల ఆలస్యం జరిగినా తల్లికి వందనం కచ్చితంగా అందజేయనున్నారు. తల్లికి వందనం ద్వారా అందిం చాల్సిన డబ్బులను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించి ఆయా జిల్లాలకు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభు త్వ ఆదేశాలను జీవో రూపంలో గురువారమే జారీ చేశారు. గురువారం జమ కాకపోవడంతో చాలా మం ది అసంతృప్తికి గురయ్యారని తెలుస్తోంది. సచివాల య ఉద్యోగులకు ఫోన్లు చేయడం, సెల్‌ఫోన్లలో మెసే జ్‌లు పరిశీలించుకోవడం, సచివాలయాలకు వెళ్లడం చేశారు. జిల్లా యంత్రాంగం ముందుగానే ప్రకటన చేసి ఉంటే బాగుండేదని పలువురు వ్యాఖ్యానించారు.

ఇవీ నిబంధనలు..

ఫ పాఠశాలలు, విద్యాశాఖ ఇంటర్మీడియట్‌ బోర్డు సమన్వయంతో సమగ్ర డేటా సేకరణ

ఫ కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించరాదు.

ఫ ఖచ్చితంగా బియ్యం కార్డు ఉండాలి.

ఫ భూమి మూడు ఎకరాల కంటే తక్కువ ఉండాలి.

ఫ నాలుగు చక్రాల వాహనం కలిగి ఉంటే (ట్రాక్టరు, ఆటోలకు మినహాయింపు) వారు అనర్హులు.

ఫ నెలవారీ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. 12 నెలల సగటు విద్యుత్‌ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

ఫ కుటుంబానికి వేయి చదరపు అడుగులకంటే ఎక్కువ విస్తీర్ణంలో మునిసిపల్‌ ఆస్తి ఉండకూడదు.

ఫ కేంద్ర, రాష్ట్ర ప్రభుతాల్లో పీఎస్‌యూలు లేదా ప్రభుత్వ పెన్షన్‌ పొందుతుంటే అనర్హులు.

ఫ పారిశుధ్య కార్మికులకు మినహాయింపు ఉంది.

ఫ గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు జీతం పొందే ఉద్యోగులకు మినహాయింపు ఉంది.

ఫ ఆదాయ పన్ను చెల్లిస్తే అర్హులు కారు.

ఫ లబ్ధిదారుడి పిల్లలు ఏపీలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదవాలి.

ఫ ఈ విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు ఉన్న విద్యార్థి తదుపరి వచ్చే ఆర్థిక సంవత్సరానికి సహాయం పొందడానికి అర్హులు.

ఫ డీబీటీ విధానంలో తల్లుల ఖాతాలకు జమ

Updated Date - Jun 13 , 2025 | 12:55 AM