ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆహా..అద్వితీయం!

ABN, Publish Date - Jul 18 , 2025 | 01:09 AM

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో ఈ సారి రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ జాతీయస్థాయిలో 19వ ర్యాంక్‌ కైవసం చేసుకుని అత్యుత్తమ ఘనత సాధించింది.

ఢిల్లీలో గురువారం కేంద్ర మంత్రి నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు అందుకుంటున్న కలెక్టర్‌ ప్రశాంతి

రాజమహేంద్రవరం సిటీ, జూలై 17 (ఆం ధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో ఈ సారి రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ జాతీయస్థాయిలో 19వ ర్యాంక్‌ కైవసం చేసుకుని అత్యుత్తమ ఘనత సాధించింది.స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2024-25 ర్యాంక్‌లను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రస్థాయిలో చూస్తే రాజమహేంద్రవరం రెండో స్థానంలో ఉంది. ప్రజల సహకారం, పారిశుధ్య సిబ్బంది కృషి ఫలితంగా రాజమహేంద్రవరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2020లో 51వ ర్యాంక్‌ , 2021లో 41వ ర్యాంక్‌, 2022లో 97వ ర్యాంక్‌, 2023లో 59వ ర్యాంక్‌, 2024-25లో 19వ ర్యాంక్‌ సాధించింది.గతంలో పోల్చితే ఈ సారి వచ్చిన ర్యాంక్‌ అత్యుత్తమమైనది. ఈ మేరకు ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో గురువారం జరిగిన కార్యక్ర మంలో కేంద్ర మంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అవార్డు అందుకున్నారు. పరిశుభ్రత కోసం తీసుకున్న వినూత్న చర్యల వల్ల క్లీన్‌ రాజమహేంద్రవరం సాధ్యమైందని కలెక్టర్‌ అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరానికి 19వ ర్యాంక్‌ రావడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. కలెక్టర్‌ వెంట ప్రభుత్వ ఎంయూడీసీ ముఖ్యకార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌,సీడీఎంఏ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ పీవీ.రామలింగేశ్వర్‌, ఎంహెచ్‌వో వినూత్న,సీవోసీ ఇన్‌చార్జి రవితేజ ఉన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 01:10 AM