ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతన్నలకు అండగా ఉంటాం!

ABN, Publish Date - May 15 , 2025 | 01:35 AM

ఆరుగాలం శ్రమించే రైతన్నకు విత్తనం నుంచి విక్రయం వరకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యా టక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ హామీ ఇచ్చారు.

నిడదవోలు, మే 14(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించే రైతన్నకు విత్తనం నుంచి విక్రయం వరకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యా టక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దగాపడిన రైతన్నకు కూటమి ప్రభు త్వం అండగా ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటుందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో మరో 8025 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయను న్నామని వెల్లడించారు. నిడదవోలు మండలంలో వెయ్యి మెట్రిక్‌ టన్నులు, పెరవలి మండలంలో వెయ్యి మెట్రిక్‌ టన్నులు, ఉండ్రాజవరం మండలంలో 6,025 మెట్రిక్‌ టన్నులు అదనపు ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నా మన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎవరు అధైర్య పడవద్దని, గతంలో పడిన పాట్లు ఏ ఒక్క రైతు పడకూ డదనే ప్రత్యేక శ్రద్ధ వహించా మన్నారు. త్వరలో ఆన్నదాత సుఖీభవ పఽథకం అమలుకానుందని తెలిపారు.

జిల్లాలో 3.17 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

రాజమహేంద్రవరం, మే14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం 2332.840 టన్నుల ధాన్యాన్ని సేకరించామని కలెక్టర్‌ ప్రశాంతి పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకూ 27,397 మంది రైతుల నుంచి 3,17,462.8 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి రూ.730.85 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకూ రూ.603.67కోట్లు ఆయా రైతుల ఖాతా ల్లో జమ చేశామన్నారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి అధిక మొత్తంలో ధాన్యాన్ని సేకరిస్తున్నామని, అందు వల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ స్పష్టంచేశారు.

Updated Date - May 15 , 2025 | 01:35 AM