ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నై..రుతుపవనాలు!

ABN, Publish Date - Jun 08 , 2025 | 01:12 AM

మొన్న మే నెలలో.. ఎక్కడ చూసినా హాయ్‌ హాయ్‌..పెద్దగా కానరాని సూరీడు..రోజంతా చల్లదనమే..మబ్బుల చాటున దాగిన సూరీడుతో మండుటెండలు మాయం..

రాజమహేంద్రవరంలో శనివారం ఎండమావులు

ఉక్కబోతతో జనం విలవిల

సుర్రుమంటున్న సూరీడు

ఏసీ రూమ్‌లకే జనం పరిమితం

జూన్‌లో వింత వాతావరణం

ఈ నెల 12న అల్పపీడనం

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

మొన్న మే నెలలో.. ఎక్కడ చూసినా హాయ్‌ హాయ్‌..పెద్దగా కానరాని సూరీడు..రోజంతా చల్లదనమే..మబ్బుల చాటున దాగిన సూరీడుతో మండుటెండలు మాయం.. అనేక చోట్ల వర్షాలు.. నిజంగానే ఇది మే నెలేనా అన్నట్టు కానరాని భారీ ఉష్ణోగ్రతలు..ఊసే లేని వడగాడ్పులు.. ఉక్కబోత...హమ్మయ్య ఈ వేసవి ఇక ముగిసిపోయింది.. అని జనం ఊపిరిపీల్చుకు న్నారు... ఈలోపు రుతు పవనాల ఆగమనం... ఇక హాయి హాయి అనుకున్నారంతా.. కానీ!

జూన్‌లో చల్లదనమే అనుకున్నారంతా.. కానీ సూరీడు సుర్రుమంటున్నాడు.. ఉదయం నిద్రలేవగానే బయట ఉక్కబోత.. తీవ్రవేడి.. కానరాని వానలు.. ఎండలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. రుతు పవనాలు వచ్చేశాయనుకుంటే వాన జాడ లేక జనం విలవిల్లాడిపోతున్నారు.. వాతావరణం మారింది.. ఏటా మే నెలో ఎం డలు మండిపోతాయి..ఇళ్ల నుంచి బయటకే రాలేం.. జూన్‌ వచ్చే సరికి వర్షాలు ప్రారంభమై వాతావరణం కొంత చల్లబడుతుంది.ఏళ్ల తరబడి కనిపించే వాతావరణ పరిస్థితులు ఇవే.. అటు వాతావరణ శాఖ కూడా ఏటా మే నెలలో ఎండలు మండిపోతాయని..జూన్‌లో నైరుతి రుతుపవనాలతో పరిస్థితి కాస్త చల్లబడుతుందని చెబుతుంటారు.అదేం విచిత్రమో కానీ.. ఈ సారి వాతావరణం ఉమ్మడి జిల్లాలో జనాలకు చుక్కలు చూపిస్తోంది. మే లో చల్లచల్లని ఆహ్లా దం పంచి..ఇప్పుడు జూన్‌లో వేడి దంచేస్తుంది. వాతావరణశాఖ నిపుణులు సైతం గందరగోళా నికి గురైన ప్రస్తుత పరిస్థితులపై రకరకాల విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

చల్లదనమే!

ఈ ఏడాది రొటీన్‌కు భిన్నంగా కాస్త చల్లదన’మే’ అనిపించాయి. ఉదయం ఎంత భానుడు విశ్వరూపం చూపినా.. సాయంత్రమయ్యేసరికి మాత్రం వరుణుడు కూల్‌ చేసేవాడు. ప్రతి రోజూ ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ, కోనసీమ, రాజ మహేంద్రవరం నగరాల్లో మే నెలలో అనేక సార్లు భారీ వర్షాలతో వర్షపాతం ఏకంగా ఆరు సెంటిమీటర్ల వరకు నమోదైంది. ఈ మూడు జిల్లాల్లో ఏకంగా అనేక మండలాల్లో వరుసగా 8 రోజులు వర్షం కురిసింది. దీంతో మే నెలంతా చల్లచల్లగా గడిచింది.కాకినాడ జిల్లాలో ఏప్రిల్‌లో 16.4 మి.మీ వర్షపాతం నమోదుకావాల్సి ఉంటే 45.78 మి.మీ. కురిసింది. మేలో 109 మి.మీ.కు 115 మి.మీ. నమోదైంది. జూన్‌కు వచ్చేసరికి 8.1 మి.మీ. తక్కువ నమోదైంది.కోనసీమ జిల్లాలో మే నెలంతా కలిసి 72.55 మి.మీ. వర్షం కుర వాల్సి ఉంటే 130 మి.మీ. కురిసింది. జూన్‌లో ఈ ఏడు రోజుల్లో ఒక్కరోజు వర్షం నమోదవ లేదు.0.65 మి.మీ. లోటు కనిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో మే నెలంతా కలిపి 78.56 మి.మీ. వర్షం కురవాల్సి ఉంటే 135.54 మి.మీ. కురిసింది. తీరా జూన్‌కు వచ్చేసరికి ఏడు రోజు ల్లో 0.76 మి.మీ. లోటు కొనసాగుతోంది.

బాబోయ్‌ జూన్‌..

జూన్‌ నెల ఆరంభం కాగానే అంతా వర్షాలే అనుకున్నారు.తీరా చూస్తే ఎండలు మండిపో తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మూడు రోజులుగా సూరీడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.ఆ ప్రచండభానుడి భగభగలతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.ఉదయం ఆరు గంటల నుంచే వా తావరణం ఉక్కబోతగా ఉంటోంది. పది గంటలకే ’ఉక్క’రూపం దాల్చుతోంది. మధ్యాహ్నం పూర్తిగా నడినెత్తిన చేరుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఈ నెల పదో తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ నెల 12న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడు తుందని అంచనా. ప్రస్తుత వాతావరణానికి కారణం మందగించిన రుతుపవనాల కదలికే అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇవి మందకొడిగా ఉండడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు.

Updated Date - Jun 08 , 2025 | 01:12 AM