ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డిగ్రీ అడ్మిషన్లు ఎప్పుడో!

ABN, Publish Date - Jun 28 , 2025 | 12:22 AM

ఇంటర్మీడియట్‌ ఫలితాలు వచ్చి రెండు నెలలు కావస్తోంది. అయితే డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ ప్రకియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలనే విషయంపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ప్రవేశాలపై అధికారిక ప్రకటన రాకుండానే ప్రైవేటు కళాశాలలు ముందస్తుగానే విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో తమ కళాశాలనే ఎంచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఫలితం గా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది. నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లోనా

ఎటూ తేల్చని ప్రభుత్వం

ఇంటర్‌ ఫలితాలు వచ్చి

ఇప్పటికే రెండు నెలలు

పలు ప్రైవేటు కళాశాలల్లో

విద్యార్థుల ముందస్తు చేరికలు

ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు

మిగిలిపోయే అవకాశం

ఉమ్మడి తూర్పు గోదావరి

జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి

ఇంటర్మీడియట్‌ ఫలితాలు వచ్చి రెండు నెలలు కావస్తోంది. అయితే డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ ప్రకియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలనే విషయంపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ప్రవేశాలపై అధికారిక ప్రకటన రాకుండానే ప్రైవేటు కళాశాలలు ముందస్తుగానే విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో తమ కళాశాలనే ఎంచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఫలితం గా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది. నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

(పిఠాపురం-ఆంధ్రజ్యోతి)

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియట్లేదు. ఇప్పటికే 1 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పూ ర్తయి తరగతులు ప్రారంభమయ్యాయి. డిగ్రీలో మాత్రం అందుకు విరుద్ధంగా వుంది. రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటివరకు ప్రవేశాలపై ఎటువంటి స్పష ్టత ఇవ్వలేదు. గత వైసీపీ ప్రభుత్వం డిగ్రీ విద్యను అస్తవ్యస్తం చేయడం, ఆన్‌లైన్‌ ప్రక్రియలో ప్రవేశాలతో సృష్టించిన గందరగోళంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు దానిని సరిచేసే పనిలో ఉన్న ఉన్నత విద్యాశాఖ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమయం అధికంగా తీసుకోవడంతో దాని ప్రభావం డిగ్రీ ప్రవేశాలపై పడింది. ప్రవేశాలను ఎప్పటికి ప్రారంభిస్తారనే విషయా న్ని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోతున్నారు.

అస్తవ్యస్తం ఆన్‌లైన్‌ విధానం

కాకినాడ జిల్లాలో కాకినాడ నగరంతో పాటు పిఠాపురం, తుని, ఏలేశ్వరం, జగ్గంపేట, పెరుమాళ్లపురం, పెద్దాపురంల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటికి దాదాపు మూడు రెట్లు అదనంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 20వేలకు పైగా సీట్లు ఉన్నాయి. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి గతం నుంచీ అమల్లో ఉన్న విధానాన్ని వైసీపీ ప్రభుత్వం మార్చివేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఫలితంగా ప్రవేశాల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. అప్పటిదాకా జూన్‌ నెలాఖరుకు పూర్తయ్యే ప్రవేశాలు ఆగస్టు, సెప్టెంబరు నెలలకు గానీ పూర్తి కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. దీంతో మరలా ఆఫ్‌లైన్‌ విధానం అమలు చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎటూ తేలని సబ్జెక్టు విధానం

డిగ్రీలో ఉన్న విద్యా విధానాన్ని గత వైసీపీ ప్ర భుత్వం మార్చివేసింది. అప్పటివరకు అమలులో ఉన్న మూడు సబ్జెక్టుల విధానాన్ని రద్దు చేసి సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానాన్ని అమలు చేసింది. దీనికి అనుగుణంగా అన్ని రకాల సబ్జెక్టులను ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉం చకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. ఈ విధానం సరిగా లేదని భావించిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి డబుల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానం అమలు చేస్తామని ప్రకటించినా ప్రభుత్వం నిలిపివేయాలని ఆదేశించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సూచించింది. అందుకనుగుణంగా సిం గిల్‌ మేజర్‌ లేదా డబుల్‌ మేజర్‌ సబ్జెక్టుల విధా నం అమలు గురించి ఉన్నత విద్యా మండలి సవివరంగా ప్రభుత్వానికి నివేదిక పంపింది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

విద్యార్థులు ఇప్పటికే అటువైపు

అడ్మిషన్ల ప్రక్రియ ప్రకటనలో జరుగుతున్న జాప్యాన్ని ప్రైవేటు కళాశాలలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఇంటర్‌ ఫలితాలు వచ్చిన వెంటనే కాకినాడ, తూర్పుగోదావరి, డాక్ట ర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని తమ కళాశాలల్లో వారిని అనధికారికంగా చేర్చుకోవడం తో పాటుమార్కుల జాబితాలు, టీసీ, ఇతర సర్టిఫికెట్లను వారి వద్ద ఉంచుకున్నాయి. ఆన్‌లైన్‌ లే దా ఆఫ్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇప్పటికే చేరినవారిని దరఖాస్తు చేయి ంచి తమ కళాశాలలను ఆప్షన్లుగా ఎంచుకునే విఽదంగా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనివల్ల ప్రైవేటు కళాశాలలకు అధిక ప్రయోజనం కలుగుతుండగా, ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు పూర్తిగా నిండ ట్లేదు. గత రెండు సంవత్సరాలలో ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో పలు సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ప్రవేశాల్లో ఇంకా జాప్యం జరిగితే ఇదే పరిస్థితి ఈ ఏడాదీ కొనసాగే అవకాశముంది. ప్రభుత్వం స్పందించి ప్రవేశాల షెడ్యూల్‌ ప్రకటించడంతో పాటు సింగిల్‌ లేదా డబుల్‌ మేజరు సబ్జెక్టులపై త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

నెలకు పైగా సాగే ప్రక్రియ

ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించినా అది నెలకు పైగా సాగుతుం ది. గతంలో ఇందుకు రెండు నెలల సమయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల చేయకపోవడంతో పాటు ఏ విధంగా అడ్మిషన్లు జరపాలన్న దానిపై నిర్ణయం తీసు కోలేదు. ఆన్‌లైన్‌లో అయితే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, కళాశాలలు, కోర్సులు ఎంచుకునేందుకు వెబ్‌ ఆప ్షన్లు, సీట్ల కేటాయింపు, తర్వాత ప్రవేశాలు జరగాల్సి ఉంటుంది. తొలి విడతలో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మరో రెండు విడతలు ప్రక్రియ నిర్వహించాలి. ఇదంతా జరిగి క్లాసులు ప్రారంభమయ్యేసరికి ఆగస్టు నెల వస్తుందని చెప్తున్నారు. ఆఫ్‌లైన్‌లో అయితే మొత్తం ప్రకియను 15రోజుల్లో పూర్తి చేసి తరగతులు ప్రారంభించే వీలుంటుంది.

Updated Date - Jun 28 , 2025 | 12:22 AM