సోమలింగేశ్వరస్వామి కల్యాణం
ABN, Publish Date - May 30 , 2025 | 12:25 AM
ర్యాలి గుడిమెరక వీధిలోనున్న పురాతన పార్వతీ సమేత ఉమాసోమలింగేశ్వరస్వామి కల్యాణాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
ఆత్రేయపురం, మే 29(ఆంధ్రజ్యోతి): ర్యాలి గుడిమెరక వీధిలోనున్న పురాతన పార్వతీ సమేత ఉమాసోమలింగేశ్వరస్వామి కల్యాణాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను వైభ వంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి కల్యాణాన్ని శివనామస్మరణల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 12:25 AM