ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి నేతలే..సారథులు!

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:17 AM

సొసైటీలకు త్రిసభ్య కమిటీలను నియమించనున్నారు. ఈ కసరత్తు చివరి దశకు చేరుకోవడంతో పాటు నిర్ణీత నివేదికలో వివరాలు పంపాలని జిల్లా సహకార అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.

సొసైటీ

నాయకుల వద్ద జాబితాలు

జిల్లాలో 298 సొసైటీలు

ప్రతి సొసైటీకి ముగ్గురు

894 మందికి అవకాశం

తుది దశకు చేరిన కసరత్తు

త్వరలోనే ఉత్తర్వులు విడుదల

వివరాలు పంపాలని ఆదేశాలు

(పిఠాపురం-ఆంధ్రజ్యోతి)

సొసైటీలకు త్రిసభ్య కమిటీలను నియమించనున్నారు. ఈ కసరత్తు చివరి దశకు చేరుకోవడంతో పాటు నిర్ణీత నివేదికలో వివరాలు పంపాలని జిల్లా సహకార అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ వారంలోనే పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలకు చెందిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా మారిన సొసైటీలను గాడిలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి నేతలతో త్రిసభ్య కమిటీలు ఏర్పడగానే ఆయా సొసైటీల్లో గతంలో జరిగిన వ్యవహారాలపై దృష్టి పెట్టి, ఎక్కడైనా అవకతవకలు జరిగితే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు, సొసైటీలను పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో 298 సొసైటీలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పరిధిలో 298 ప్రాథమిక విశాల వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(సొసైటీలు) ఉన్నాయి. కాకినాడ జిల్లాలో 72, తూర్పుగోదావరి జిల్లాలో 49, డాక్టర్‌ బీఆర్‌ అం బేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 166, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 సొసైటీలు ఉండగా వీటి పదవీకాలం గత వైసీపీ ప్రభుత్వ పాలనలోనే ముగిసింది. అప్పటి నుంచీ సొసైటీలు, డీసీసీబీలు,డీసీఎంఎస్‌లకు ఎన్నికలు నిర్వహించలేదు. గడువు ముగిసిన సొసైటీలన్నింటికీ త్రిసభ్య కమిటీలను నియమించారు. వైసీపీ నేతలతో సొసైటీలను నింపేశారు. నాలుగేళ్ల పాటు ఎన్ని కలు జరపకుండా ఆరు నెలలకోసారి వీటి గడు వు పెంచుకుంటూ వెళ్లారు. దీంతో సొసైటీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. పలు సొసైటీల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి.

ప్రస్తుతం అధికారుల పాలనే..

వైసీపీ పాలనలో నియమించిన త్రిసభ్య కమిటీల సభ్యుల్లో కొందరు కూటమి ప్రభుత్వం అధి కారంలోకి రాగానే రాజీనామా చేశారు. మిగిలిన వారిని ప్రభుత్వం తొలగించింది. డీసీసీబీ, డీసీ ఎంఎస్‌లతో పాటు సొసైటీలకు సహకారశాఖ అధికారులను పర్సన్‌ ఇన్‌చార్జిలుగా నియమించింది. ఒక్కొక్క అధికారికి కనిష్ఠంగా రెండు నుంచి గరిష్ఠంగా ఐదు సంఘాల బాధ్యతలు అప్పగించడంతో సొసైటీల్లో పర్యవేక్షణ తగ్గడంతో పాటు కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బం దులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వీరి గడువు ఈ నెల 26-28 తేదీల మధ్య ముగియగా జూలై 31 వరకు మాత్రమే పొ డిగించారు. ఈ మే రకు త్రిసభ్య కమి టీల ఎంపికను వేగవంతం చేశా రు.

ఎదురుచూపులు..

సొసైటీలకు ప్రతిపాదించిన త్రిసభ్య కమిటీల(చైర్మన్‌, ఇద్దరు డైరెక్టర్లు)కు సంబంధించిన పూర్తి వివరాలు పంపాలని సహకారశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు 18 అంశాలతో కూడిన నివేదికను అధికారులకు పంపారు.ప్రస్తుతం నివేదికలో వివరాలను ఆయా సొసైటీల సీఈవో లేదా కార్యదర్శుల నుంచి సేకరించి ప్రభుత్వానికి పంపడంలో ఉమ్మడి జిల్లా సహకార అధికారులు నిమగ్నమయ్యారు. ఈ వివరాలన్నీ జిల్లాల నుంచి ప్రభుత్వానికి చేరగానే వారం వ్యవధిలోనే త్రిసభ్య కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయని భావిస్తున్నారు. త్రిసభ్య కమిటీల నియామకంపై ఏమైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నియామకానికి కూటమిలోని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.కూటమి ప్రభుత్వం వ చ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు నియా మక ఉత్తర్వులు రాకపోవడంపై వారిలో కొం త అసంతృప్తి ఉంది.త్రిసభ్య కమిటీల నియా మక కసరత్తును దాదాపు నాలుగు నెలల కిందట ప్రారంభించారు.ఎంతకీ ఆదేశాలివ్వక పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రిస భ్య కమిటీ చైర్మన్‌,డైరెక్టర్లుగా నియమితులైన వారుఎన్నికలకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

కమిటీల నియామకంపై కసరత్తు

సహకార సంఘాల వ్యవస్థలో కీలకమైన డీసీసీబీలు, డీసీఎంఎస్‌లకు కూటమి నేతలను చైర్మన్లుగా నియమించింది.డీసీసీబీ చైర్మన్‌గా తుమ్మల బాబు,డీసీఎంఎస్‌ చైర్మన్‌గా పెచ్చెట్టి చంద్ర మౌళి ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. వీటికి పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. సొసైటీలకు త్రిసభ్య కమిటీల నియామకంపై కసరత్తు తుది దశకు చేరింది.కూటమి నేతలు ప్రతి సొసైటీకి చైర్‌పర్సన్‌, ఇద్దరు సభ్యులను ప్రతిపాదించారు. ఆయా నియోజకవర్గాల బాధ్యులు వీటి పేర్లను ఇప్పటికే పంపినా నేతల మధ్య అభిప్రాయభేదాల కారణంగా జాప్యం చోటు చేసుకుం ది. ఈ పదవులకు కూటమి నేతలు పోటీపడడంతో సర్దుబాటుకు ఇబ్బందులు తప్పలేదు.

Updated Date - Jun 30 , 2025 | 12:17 AM