ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్మార్ట్‌..మీడర్‌!

ABN, Publish Date - Jul 11 , 2025 | 01:24 AM

విద్యుత్‌ వినియోగదారులు స్మార్ట్‌ మీటర్ల షాక్‌ కొడతాయని ఆందోళన చెందుతున్నారు.

స్మార్ట్‌ మీటర్ల గందరగోళం

ప్రభుత్వ ఆఫీస్‌, కమర్షియల్‌ ముందు

గృహాలకు ప్రభుత్వ అనుమతి లేదు

బిగించిన వాటికి 2 శాతం అదనపు బిల్లు

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

విద్యుత్‌ వినియోగదారులు స్మార్ట్‌ మీటర్ల షాక్‌ కొడతాయని ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్‌ మీటర్లు వద్దంటూ మొండికేస్తున్నారు. ఈ మీటర్ల మార్పు వివాదాస్పదమైంది. స్మార్ట్‌ మీటర్లను మార్చుకోవచ్చని చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. అయినా ఇంత వరకూ గృహ వినియోగానికి సంబం ఽధించి స్మార్ట్‌ మీటర్ల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. స్మార్ట్‌ మీట ర్లపై గత వైసీపీ ప్రభుత్వంలోనే ఆదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చున్న సంగతి తెలిసి ందే. ఈ మీటర్లు బిగిస్తే ఎక్కువ బిల్లు వస్తుం దని..ఈ విధానంలో రీచార్జి ఆఫ్షన్‌ ఉండడం వల్ల బిల్లులు విధానం ఉండదని.. ముందుగా డబ్బు చెల్లిస్తేనే విద్యుత్‌ సరఫరా అవుతుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ నేపఽథ్యం లో గృహ వినియోగానికి సంబంఽధించి ఇంత వరకూ స్మార్ట్‌ మీటర్ల బిగింపు విషయంలో ఏ విధమైన నిర్ణయమూ తీసుకోలేదు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, కేటగిరీ -2కు చెందిన వాణిజ్య రంగ వినియోగదారులకు మాత్రం తప్పనిసరిగా బిగిస్తున్నారు. జిల్లాలో గ్రామ పం చాయతీలు, వీధిలైట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పాటు చేస్తున్నారు.జిల్లా లో మొత్తం 10,681 ప్రభుత్వ కార్యాలయాలు ఉం డగా ఇప్పటికే 9,860 మీటర్లు బిగించారు. వాణి జ్యానికి సంబంధించిన వినియోగదారులు, 500 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వినియో గించిన గృహ వినియోగదారులకు బిగించాలని గుర్తించారు. కానీ కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ కేటగిరిలో ఒక లక్షా 40 వేల 717 మంది వినియోగదారులను గుర్తించగా ఇప్పటికే 48,115 స్మార్ట్‌ మీటర్లు బిగించారు. ఇందులో సుమారు 4 వేల మంది వరకూ ఎక్కువ విద్యుత్‌ వినియోగించే గృహ వినియో గదా రులు కూడా ఉన్నట్టు గమనార్హం. కానీ అసలు గృహాలకు మీటర్లు మార్పు విష యంలో ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోక పోయినప్పటికీ.. ఓ జాబితా పట్టుకుని ఆదాని గ్రూపునకు చెం దిన ఉద్యోగులు ఇళ్లు, అపార్ట్‌ మెంట్లకు తిరు గుతుండడం గమనార్హం. అధికా రికంగా అయి తే విద్యుత్‌ శాఖకు సంబంధించిన ఉద్యోగి ఆధారాలతో వచ్చేవారని..అయినా స్మార్ట్‌ మీట ర్లు బిగించడానికి తాము ఒప్పుకోమని ప్రజలు తిప్పి పంపుతున్నారు. ప్రస్తుతం బిగించిన ప్రాంతాల్లో కొంత ఎక్కువ బిల్లులు వస్తుండ డం గమనార్హం. ఈ మీటర్లు బిగిస్తే 2 శాతం వరకూ పెరగవచ్చని అంచనా. స్మార్ట్‌ మీటరు మొబైల్‌ యాప్‌లో లాగిన అయితే ప్రతి అర గంటకూ ఎంత విద్యుత్‌ వినియోగమైందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చని..దాని వల్ల ఎంత వాడుకోవాలో తెలుసుకునే సౌలభ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్‌మీటర్లు బిగిం చడానికి ఎవరూ ఒప్పకోవద్దని వామపక్షాలు, ఇతర నాయకులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నా రు. ప్రజలు కూడా సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ మీటర్లు మార్చడం అనేది వివాదాస్పదమైంది.

Updated Date - Jul 11 , 2025 | 01:24 AM