నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో టీ హబ్!
ABN, Publish Date - May 24 , 2025 | 01:02 AM
రాజమహేంద్రవ రం రూరల్ మండలం బొమ్మూరు పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఉన్న నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో టెక్నాలజీ హబ్(టీ హబ్) ఏర్పాటయ్యే అవకా శం ఉన్నట్టు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలి పారు. కలెక్టర్ చాంబర్ నుంచి టీ-హబ్ ఏర్పాటు విషయమై సమన్వయ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తొలిదశలో 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభం
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో మరిన్ని సదుపాయాల కల్పన
జిల్లా కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం రూరల్, మే 23(ఆంధ్ర జ్యోతి): రాజమహేంద్రవ రం రూరల్ మండలం బొమ్మూరు పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఉన్న నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో టెక్నాలజీ హబ్(టీ హబ్) ఏర్పాటయ్యే అవకా శం ఉన్నట్టు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలి పారు. కలెక్టర్ చాంబర్ నుంచి టీ-హబ్ ఏర్పాటు విషయమై సమన్వయ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రంలో టీ హబ్ ఏర్పాటు కోసం నైపు ణ్యాభివృద్ధి కేంద్ర భవనంతో పాటు ఒక ప్రైవేటు భవనాన్నా పరిశీలించినట్టు తెలిపారు. టీ హబ్ ఏర్పాటుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం అన్ని విధాల అనుకూలంగా ఉన్నట్టు ప్రాథమికంగా పరిశీలన అనంతరం ఒక అంచనాకు వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే మరికొన్ని మౌలిక సదుపాయా లు కల్పించాల్సి వుంటుందన్నారు.అందుకు అను గుణంగా అవసరమైన పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని కలెక్టర్ చెప్పారు. దివ్యాంగుల కోసం అవసరమైన ర్యాంపును, లిఫ్టును ఏర్పా టు చేయాలని అధికారులను సూచించారు. టీ హబ్‌ను తొలిదశలో మొదట 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించనున్నట్టు తెలి పారు. అనంతరం 7 వేల చదరపు అడుగులకు పెంచుతామని, విస్తరణ పనులను 100 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉందని ప్రశాంతి చెప్పారు. పరిశ్రమల భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే టీ హబ్ యువతకు ఎంతగానో ఉపయోగకరంగా వుంటుందన్నారు. ఈ హబ్‌లో జేఎన్‌టీయూ కా కినాడ, ఎన్‌ఐటీ తాడేపల్లిగూడెం, అవంతి, గ్రీన్ కో సంస్థలు భాగస్వాములుగా ఉన్నట్టు తెలిపా రు. బోర్డులో జాయింట్ కలెక్టర్ సభ్యుడిగా ఉం టారన్నారు. హబ్‌కు అవసరమైన భవనాలు, సిబ్బంది మౌలిక వసతులను దశల వారీగా సమకూర్చుతామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవాణిధర్ రామన్, సహాయకులు ప్ర దీప్, మెప్మా ఇన్‌చార్జి పిడీ శ్రీదేవి, నైపుణ్యా భివృద్ధి అధికారి వీజీడీ మురళి, ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్ ఆధారిత వర్కర్లు ఈ-శ్రమ్ పొందాలి
రాజమహేంద్రవరం, మే 23(ఆంధ్రజ్యోతి): డెలివరీ బాయ్స్‌గా వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ల ఆధారంగా అసంఘటిత రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు/వర్కర్లు కార్మిక శాఖ జారీ చేసే గుర్తింపు కార్డులను పొందాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. కార్డులు పొందడానికి ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 31 వరకూ ప్రత్యేక నమోదు డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, ర్యాపిడో, ఊబర్, ఓలా, బ్లింకిట్ వంటి వాటి ద్వారా ఆహార, సరుకు రవాణా, డెలివరీ రైడ్-షేరింగ్, కొరియర్ సేవలందిస్తున్న వర్క ర్లు, డ్రైవర్లు అర్హులన్నారు. ఈ ఉచిత గుర్తింపు కార్డును పొందడం ద్వారా రూ.5 లక్షల పీఎం జన్ ఆరోగ్య యోజన వార్షిక ఆరోగ్య కవరేజీ ఉంటుందని సహాయ కార్మిక కమిషనర్ బీఎస్ ఎం వలీ తెలిపారు. మరిన్ని వివరాలకు కార్మిక శాఖను సంప్రదించాలన్నారు.
Updated Date - May 24 , 2025 | 01:03 AM