ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మూడేళ్లుగా.. ఇంతేగా!

ABN, Publish Date - Jul 07 , 2025 | 12:44 AM

కోరుకొండ, ముగ్గళ్ల గ్రామాల మధ్య వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. సుమారు 10కిలోమీటర్ల మేర రెండు మండలాలను కలిపే ఈ ప్రధాన రహదారిని డబుల్‌ రోడ్డుగా విస్తరించడానికి పనులు చేపట్టారు. మార్గం మధ్యలో మునగాల తోట కాలువ సమీపంలోను, రాజు చెరువు సప్లై కాలువ వద్ద వంతెనలు నిర్మించాల్సి ఉంది. అందుకోసం రోడ్డు మధ్యన గండి కొట్టి ప్రయాణిలకు డ్రైవర్షన్‌ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే కాంట్రాక్టర్‌కు ప్రభు త్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మ ధ్యలో ఆపివేశారు.

మునగాల రోడ్డులోని తోట కాలువ సమీపంలో కొట్టుకుపోయిన తూరలు
  • సా..గుతున్న కోరుకొండ-ముగ్గళ్ల రహదారి విస్తరణ పనులు

  • తోట కాలువ వరద ఉధృతికి కొట్టుకుపోతున్న డైవర్షన్‌ రోడ్డు

  • ఇబ్బందులు ఎదుర్కొంటున్న 10 గ్రామాల ప్రజలు

కోరుకొండ, జూలై 6(ఆంధ్రజ్యోతి): కోరుకొండ, ముగ్గళ్ల గ్రామాల మధ్య వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. సుమారు 10కిలోమీటర్ల మేర రెండు మండలాలను కలిపే ఈ ప్రధాన రహదారిని డబుల్‌ రోడ్డుగా విస్తరించడానికి పనులు చేపట్టారు. మార్గం మధ్యలో మునగాల తోట కాలువ సమీపంలోను, రాజు చెరువు సప్లై కాలువ వద్ద వంతెనలు నిర్మించాల్సి ఉంది. అందుకోసం రోడ్డు మధ్యన గండి కొట్టి ప్రయాణిలకు డ్రైవర్షన్‌ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే కాంట్రాక్టర్‌కు ప్రభు త్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మ ధ్యలో ఆపివేశారు. అప్పటి నుంచి ముగ్గళ్ల, కూనవరం, మునగాల, కాపవరం, కోరుకొండ గ్రామాల మీదుగా సీతానగరం వెళ్లే ప్రయాణికులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రతి నిత్యం అనేక మంది ఈ రోడ్డులో ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో గత ఏడాది తోట కాలువ వరద ఉధృ తికి గండిపడి డైవర్షన్‌ రోడ్డు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి కోరుకొండకు మార్గం లేదు. అలా గే కాపవరం, కోరుకొండ గ్రామస్థులు మునగాల, కూనవరం వెళ్లేందుకు మార్గం లేదు. దీంతో 3 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి శ్రీరంగప ట్నం మీదుగా వెళ్లాల్సి వచ్చేది. గత ఏడాదంతా ప్రజలు ప్రయాణం చేసి ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కాంట్రాక్టర్లతో మా ట్లాడి తోట కాలువ వద్ద వంతెన నిర్మాణ పను లు ప్రారంభించారు. అయితే గత డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ పనులు నేటికి పూర్తి కాలేదు. దీంతో మరోసారి తోట కాలువ వరదకు డైవర్షన్‌లో వేసిన తూరలు కొట్టుకుపోయాయి. దీంతో కూనవరం, మునగాల గ్రామాలకు కష్టాలు మొ దలయ్యాయి. శ్రీరంగపట్నం మీదుగా చుట్టూ తిరిగి కోరుకొండకు వస్తున్నారు. తక్షణం వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని పది గ్రా మాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Updated Date - Jul 07 , 2025 | 12:44 AM