ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా సీతారామచంద్రస్వామి ఆవిర్భావ శతాబ్ది మహోత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - May 19 , 2025 | 12:47 AM

అయినవిల్లిలంక గ్రామంలో 1925వ సంవత్సరంలో ప్రతిష్ఠితమైన శ్రీసీతారామచంద్రస్వామి వారి శతాబ్ధి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

అయినవిల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి): అయినవిల్లిలంక గ్రామంలో 1925వ సంవత్సరంలో ప్రతిష్ఠితమైన శ్రీసీతారామచంద్రస్వామి వారి శతాబ్ధి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీమహాసుదర్శన, అష్టోత్తర శతకలశాభిషేక, శ్రీలక్ష్మీనారాయణ, శ్రీరామనామయజ్ఞంలను సుదర్శనం వెంకట జనార్దనాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరుణ, దీక్షాధారణ, అకల్మష హోమాలు, వల్మీక మృత్తికా సంగ్రహణం, యాగశాల ప్రవేశం, యాగమందిర పూజ, నవకుంభారాధన, అంకురార్పణ, వాస్తుపూజ, షట్కుండ ప్రణయనం, అగ్నిప్రతిష్ఠాపనలు, వాస్తు శుద్ధి, యాగశాల ప్రధాన హోమాలు, వర్షవర్థన దైవత్వ హోమాలు జరిపారు. దేవదాయ శాఖ కమిషనరు కె.రామచంద్రమోహన్‌, చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్‌, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 12:47 AM