ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అద్భుతమే కానీ!

ABN, Publish Date - Jun 07 , 2025 | 01:02 AM

అదొక అద్భుతం..అయినా ఎందుకో నిర్లక్ష్యం.. నాడు వైసీపీ ప్రభుత్వంలో కోట్లు ఖర్చు పెట్టారు.. ఎందుకు కొర గాకుండా వదిలేశారు

రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రం భవనం

నేటికి ప్రారంభంకాని సైన్స్‌ మ్యూజియం

2019లోనే నిర్మాణ పనులు ఆరంభం

వైసీపీ హయాంలో పూర్తయిన పనులు

గతంలో పవన్‌ ప్రారంభిస్తారని ప్రచారం

నిరుపయోగంగా మారిన విజ్ఞానం

సీఎం చంద్రబాబు రాక..మళ్లీ ఊహాగానాలు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

అదొక అద్భుతం..అయినా ఎందుకో నిర్లక్ష్యం.. నాడు వైసీపీ ప్రభుత్వంలో కోట్లు ఖర్చు పెట్టారు.. ఎందుకు కొర గాకుండా వదిలేశారు..పోనీ కూటమి ప్రభుత్వంలో అయినా పట్టించుకుంటా రనుకుంటే ఎందుకో మరి వదిలేశారు..ఎప్పుడో డిసెంబరు రెండో వారంలో అనుకుంటా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వస్తారు..ప్రారంభిస్తారని హడావుడి చేశారు.. నేటికీ ఆరంభమే కాలేదు.. కోట్లు ఖర్చు చేసి బొమ్మూరులో నిర్మించిన రాజమండ్రి విజ్ఞాన కేంద్రం (సైన్స్‌ మ్యూజియం) ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఈ నెల 10 లేదా 12 తేదీల్లో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

పనులు ఆరంభం 2019

2017లో మంజూరైన రాజమండ్రి విజ్ఞాన కేం ద్రం నిర్మాణానికి 2018 ఫిబ్రవరి 18న అప్పటి ఎంపీ మాగంటి మురళీమోహన్‌, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి శంకుస్థాపన చేశారు. రూ.16.82 కోట్లు అంచనా వ్యయంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. కానీ ఎన్నికల సీజన్‌ కావ డంతో పని జాప్యమైంది. ఆ తరువాత ప్రభు త్వం మారడంతో చాలాకాలంపాటు దీని ఊసే మరచిపోయారు. తరువాత ఎన్నికల ముందు హడావుడిగా పనులు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ పనిచేసినా గందరగోళమే. సైన్స్‌ మ్యూజియం పరిస్థితి కూడా అంతే. కోట్లు ఖర్చు పెట్టి కట్టారు వదిలేశారంతే.. నేటికి విని యోగంలోకి రాకుండా ఉంచేశారు. 2019లో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే మ్యూజియం నిర్మాణ పనులు ప్రారం భమైనా రివర్స్‌ టెండరింగ్‌ నేపథ్యంలో నిలిచి పోయాయి. సుమారు మూడేళ్లపాటు పనులు ముందుకు కదల్లేదు. నిధులున్నా పనులు నీర సమే. ఆ తరువాత పనులు ఆరంభించినా తూతూ మంత్రంగా చేసి వదిలేశారు.

సమస్య ఉన్నా కట్టేశారు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సైన్స్‌ మ్యూజియం నిర్మాణానికి బొమ్మూరులో సుమారు 5 ఎకరాల స్థలం కేటాయించారు. రోడ్డు కంటే బాగా పల్లంగా ఉంటుంది. దీనిని మెరక చేయడానికి అప్పటి ఎంపీ మాగంటి మురళీమోహన్‌ మట్టి కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. తర్వాత ప్రభుత్వం మారింది. అవేమీ పట్టించుకోలేదు. పల్లపు ప్రాంతంలోనే నిర్మించారు. దీనిని సరిదిద్దడానికి జిల్లా అధికార యంత్రాంగం నానా తంటాలు పడ్డారు. ప్రస్తుతం విలువైన ఈ విజ్ఞాన కేంద్రం పల్లపు ప్రాంతంలోనే ఉంది. కానీ ప్రహారీ చుట్టూ డ్రెయిన్లు తవ్వారు. ప్రవాహారీ లోపల, విజ్ఞాన కేంద్రం చుట్టూ వానపడినా లోపలకు నీరు వచ్చే ప్రమాదం ఉంది. అంత పల్లంగా ఉంటుంది. దీనికోసం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేసి, వాన నీటిని మళ్లించే ఏర్పాట్లు చేశారు. ఎంత చేసినా ఈ విజ్ఞాన కేంద్రానికి ఇది సమస్యే. దీని నిర్మాణ సమయంలో ఏపీ కాస్ట్‌ అధికారులు కనీస పర్యవేక్షణా చేయలేదు. సైట్‌ ఆఫీసర్‌ను నియమించలేదు. డిపార్ట్‌మెంట్‌కు సంబం ధించిన ఒక సూపర్‌వైజర్‌ నెలకో, రెండు నెలలకో ఒకసారి వచ్చేవారు. దీంతో ఇక్కడ సమస్యగా మారింది. దీంతో ఈ కేంద్రం ఎలా తెరవాలో తెలియక ప్రస్తుత ప్రభుత్వంలో మల్లగుల్లాలు పడుతోంది.. తెరిస్తే నిర్వహణ కష్టంగా ఉండనుంది. తెరవకపోతే విజ్ఞానం మూలనపడిపోతోంది. ఈనెల 12న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేసే అవకాశం ఉంది.

లోపలంతా అద్భుతః

ఈ విజ్ఞాన కేంద్రం చాలా బాగుంటుంది. లోపల ఒక అద్భుతమే. సైన్స్‌కు సంబంధించిన పరికరాలు.. ప్రయోగాలు ఏర్పాటుచేశారు. విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం కూడా. ఇది జీప్లస్‌ 1గా నిర్మించారు. గ్రౌండ్‌లో మూడు రూమ్‌లు ఉన్నాయి. ఫస్ట్‌ ఫ్లోర్‌లో 6 గ్యాలరీలు ఉన్నాయి. ఆడిటోరియం, కాన్ఫరెన్స్‌ హాల్‌ ఉంది. సాంకేతికపరమైన 18 ఎగ్జిబిషన్లు ఉన్నాయి. ఓపెన్‌ గ్రౌండ్‌లో సైన్స్‌ పార్కు ఉంది. రన్‌ నియన్స్‌ గాలరీలో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌కి సంబంధించి 33 విజ్ఞాన అంశాలు ఉన్నాయి. అటవీ, పర్యా వరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించిన మరో నిర్మాణం చేయను న్నారు. వాటర్‌ వర్రీస్‌ గ్యాలరీలో వర్చువల్‌ మ్యూజియం, మరో 35 ఎగ్జిబి షన్లు ఉన్నాయి. చిత్రాల సౌండ్‌ ఫైల్‌ల సేకరణ, ఖగోళ వస్తువులు, సాంకేతిక, శాస్ర్తీయ, పారిశ్రామిక పురోగతికి సంబంఽధించిన 32 ప్యానెల్‌లు ఉన్నాయి. అజర్నీ విత్‌ లైట్‌ పై స్పేస్‌, గెలాక్సీ,, సౌర వ్యవస్త, గ్రహాలతో కూడిన 20 ప్యానెల్స్‌ ఉన్నాయి. డ్రోన్లు, రోబోల టెక్నాలజీని చెప్పడం కోసం రోబోటిక్‌ ల్యాబ్‌ ఉంది. ఈ విజ్ఞాన కేంద్రం అధికారిగా ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఒకరు, నలుగురు ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్లు, టెక్నీషియన్‌ ఒకరిని నియమించారు. హౌస్‌కీపింగ్‌, సెక్యూర్టీ, ఆఫీసుబాయ్‌తో కలిపి 16 మంది పనిచేస్తున్నారు.

Updated Date - Jun 07 , 2025 | 01:02 AM