పనులు కుంటుబడి!
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:24 AM
పాఠ శాలలు పునఃప్రారంభమయ్యాయి.. విద్యార్థులు తరగతులకు వెళుతున్నారు..కానీ సమస్యలు మాత్రం తీరలేదు..నేటికి తొంగి చూస్తూనే ఉ న్నాయి.
నాడు 4137 పనులు మంజూరు
పూర్తయినవి 382 పనులు
అసంపూర్తిగా మిగిలినవి
బడుల ఎదురుచూపులు
కొవ్వూరు, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : పాఠ శాలలు పునఃప్రారంభమయ్యాయి.. విద్యార్థులు తరగతులకు వెళుతున్నారు..కానీ సమస్యలు మాత్రం తీరలేదు..నేటికి తొంగి చూస్తూనే ఉ న్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనలో భాగంగా వైసీపీ ప్రభుత్వ హ యాంలో నాడు నేడు పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ పనులు నేటికీ అసంపూర్తిగా మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరు వాత మన బడి - మన భవిష్యత్ పథకంలో భాగంగా అసంపూర్తిగా నిలిచిపోయిన పను లపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం, మరుగుదొడ్లు,తాగునీరు, విద్యుద్దీకరణ, పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్ వంటి 9 రకాల పనులు మంజూరు చేసి ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాల యాజమాన్య కమిటీల భాగస్వామ్యంతో పను లు చేపట్టారు. అయితే పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపో యాయి. కొన్ని పాఠశాలలకు నిధులు విడుదల చేసినప్పటికి వాటిని ఏవిధం గా ఖర్చు చేయాలని విధివిధానాలు రూపొందించలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
వేసవి సెలవులు పూర్తయినా..
వేసవి సెలవులు పూర్తి కావడంతో గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. పాఠశాలలు పునః ప్రారంభం నాటికి అన్ని యాజమాన్యాల్లోని పా ఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ ఆదేశించింది. 2023-24 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 655 పాఠశాలల్లో రూ.259.10 కోట్లు అంచనా వ్యయంతో 4137 పనులు మంజూరు చేశారు. వాటిలో రూ. 131.59 కోట్లు ఖర్చు చేసి 382 పనులు పూర్తి చేశారు. 2903 పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి.852 పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కొవ్వూరు మండలంలో 34 పాఠశాలల్లో రూ.11.12 కోట్లు అంచనా వ్యయం తో 194 పనులు మంజూరు చేశారు. వాటిలో 163 పనులు ప్రారంభించారు. గతేడాది కాల ంగా అవి వివిధ దశల్లో పనులు నిలిచిపోయా యి. ఇంకనూ 31 పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. పనులు చేపట్టడానికి నిధు లు విడుదల కాకపోవడంతో 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్‌కు 6 నెలల ముందు నుంచే ప నులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వంలో అయినా అసంపూర్తి పనులకు నిధులు మంజూరు చేసి 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేస్తారని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు భావించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో నిలుపుదల చేసిన పనులకు త్వరితగతిన నిధులు మంజూరుచేసి పూర్తిచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Updated Date - Jun 17 , 2025 | 12:24 AM