ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

725.. నో సర్టిఫై!

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:29 AM

మీ పిల్లలు బడి బస్సులో వెళ్లి వస్తున్నారా? ఆ వాహనానికి ఫిట్‌నెస్‌ (ప్రయాణించే సామర్థ్యం) ఉందో లేదో చూసుకోండి మరి. ఎందుకంటే పాఠ శాలలు తెరిచేసినా ఇంకా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొం దని బస్సులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వందల్లో ఉన్నాయి. 2025-26 నూతన విద్యా సం వత్సరం ఈ నెల 12 నుంచి ప్రారంభమైంది. అ యితే ఇంకా ఉమ్మడి జిల్లాలో బడి బస్సుల సామ ర్థ్య పరీక్షలు అన్నిటికీ పూర్తి కాలేదు. ఫిట్‌నెస్‌ పూర్తయిన వాటిపైనా పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ప్రైవేటు పా ఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు బస్సుల్లోనే వెళ్లి వస్తుంటారు. విద్యార్థులను ఎక్కించుకునే

ఉమ్మడి తూర్పుగోదావరి

జిల్లాలో 3970 స్కూల్‌ బస్సులు

ఇంకా పూర్తికాని 725 బస్సుల ఫిట్‌నెస్‌

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

ఫిట్‌లో రవాణా శాఖ పాత్ర సున్నా

‘అన్నీ’ ప్రైవేటు సంస్థే.. తీవ్ర ఆరోపణలు

తెరుచుకున్న పాఠశాలలు

ఆందోళనలో తల్లిదండ్రులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మీ పిల్లలు బడి బస్సులో వెళ్లి వస్తున్నారా? ఆ వాహనానికి ఫిట్‌నెస్‌ (ప్రయాణించే సామర్థ్యం) ఉందో లేదో చూసుకోండి మరి. ఎందుకంటే పాఠ శాలలు తెరిచేసినా ఇంకా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొం దని బస్సులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వందల్లో ఉన్నాయి. 2025-26 నూతన విద్యా సం వత్సరం ఈ నెల 12 నుంచి ప్రారంభమైంది. అ యితే ఇంకా ఉమ్మడి జిల్లాలో బడి బస్సుల సామ ర్థ్య పరీక్షలు అన్నిటికీ పూర్తి కాలేదు. ఫిట్‌నెస్‌ పూర్తయిన వాటిపైనా పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ప్రైవేటు పా ఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు బస్సుల్లోనే వెళ్లి వస్తుంటారు. విద్యార్థులను ఎక్కించుకునే బస్సులకు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఉం డాలి. ప్రతి ఏడాదీ ఈ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండేళ్లకు పొడిగించారు. మార్చి వరకూ రోడ్డు రవాణా అధికారులు నిబం ధనల ప్రకారం తనిఖీ చేసి ఆ ధ్రువపత్రాన్ని జారీ చేయడం జరిగేది. కానీ ఆ తంతును ప్రైవేటుకు అప్పగించడంతో ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ సిస్టం ద్వారా ప్రైవేటు సంస్థ ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ చేస్తోంది. కోనసీమ జిల్లాలో ఏటీఎస్‌ నిర్మాణంలో ఉండడంతో రవాణా అధికారులు వాహన సామ ర్థ్య పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందని బస్సులు వందల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

సర్టిఫికెట్‌ జారీ ఇలా..

రవాణా శాఖ ఆవిర్భావం నుంచి స్కూల్‌ బస్సులకు ఆ శాఖే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చే స్తోంది. వాహనాన్ని రవాణా అధికారులు భౌతి కంగా నిబంధనల ప్రకారం తనిఖీ చేసి ఒక వేళ ఏవైనా మరమ్మతులు ఉంటే చేయించుకున్న త ర్వాత ధ్రువపత్రం జారీ చేసేవారు. చాలామంది అలసత్వం వహిస్తుండడంతో రవాణా శాఖ ఓ వెబ్‌సైటు రూపొందించింది. వెబ్‌సైటులో నేరుగా పాఠశాల యజమానులు బస్సుల వివరాలు, డ్రైవ ర్ల వివరాలను అప్‌లోడ్‌ చేసుకునేలా వెసులు బాటు కల్పించారు. వెబ్‌సైటులో స్కూల్‌ వివరాలను పూర్తిగా నమోదు చేయాలి. తర్వాత వచ్చే ధ్రువపత్రాన్ని ప్రింట్‌ తీసుకుని స్థానిక రవా ణా అధికారి వద్దకు వాహనంతో వెళ్తే నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించి బ్రేక్‌ నిమిత్తం చలానా కట్టిస్తారు.

వైసీపీ నిర్వాకం

కానీ వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో కూడా నిర్వాకాన్ని వెలగబెట్టింది. శి క్షణ పొందిన అధికారులను కాదని ఫిట్‌నెస్‌ జారీని పూర్తిగా ప్రైవేటు సం స్థలకు అప్పగించింది. దానినే ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. వాస్తవానికి కేంద్రప్రభుత్వం ఈ విధానానికి సంబంధించిన నిర్దేశాలను అన్ని రాష్ట్రాలకూ జారీ చేసింది. అయితే చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉన్నా నియంత్రణ మాత్రం రవాణా శాఖ చేతుల్లోనే ఉంచారు. మన దగ్గర మాత్రం పూర్తిగా ప్రైవేటుకే ధారాదత్తంచేయడంతో ‘రేటు’ పెట్టి మరీ పనులు కానిచ్చేస్తున్నారని చెబుతు న్నారు. స్కూల్‌ బస్సుల సామర్థ్య ధ్రువీకరణలో కూడా రూ.4వేల నుంచి రూ.12వేల వరకూ అద నంగా వసూలు చేస్తూ బస్సు ఏటీఎస్‌కి వెళ్లక పోయినా, నెంబరు ప్లేట్లు మార్చి తీసుకొస్తున్నా పని కానిచ్చేస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నా రు. ఒకవేళ పైసొమ్ము ఇవ్వకపోతే ఏదో సాకు చూపించి వేధిస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఓ ఆటోవాలా ఫిట్‌నెస్‌కి వెళ్లగా పైసొమ్ము ఇవ్వ లేదనే సాకుతో వేధించడంతో ఆవేదనతో తన ఆటో అద్దం తనే బద్దలు కొట్టుకొని నిరసన తెలి పాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సర్దు బాటు చేయాల్సి వచ్చింది. అలాగే ఎఫ్‌సీ ఒక వాహనం పేరున ఉండి.. మరో వాహనం నెంబ రుతో ఎఫ్‌సీ ఉం డడం వంటి కూ డా ఉంటున్నా య ని చెబుతు న్నారు. కొన్ని రాష్ట్రాలు ప్రైవేటు సంస్థ ఫిట్‌నెస్‌ చూసే ప్రదేశంలో రవా ణా శాఖ నుంచి అనుభవం కలిగిన అధికారులను నియమించి జాగ్రత్తగా అమలు చేస్తున్నాయి. మన దగ్గర మాత్రం పూర్తిగా ప్రైవేటుకే దాసోహం అయిపోయారు. ఆర్టీవోకి కూడా లాగిన్‌ అధికారం లేకుండా పోయి ంది. విద్యార్థుల విషయంలో ఈ తంతు ప్రమా దానికి కోరలు ఇచ్చినట్లుగా ఉందనే వాదన వినవస్తోంది.

అటువైపు చూడొద్దు

సదరు ప్రైవేటు సంస్థ వైపు కన్నెత్తి చూడొద్దని రవాణా అధికారులకు ఆదేశాలు ఉండడంతో అచే తనంగా ఉండాల్సి వస్తోంది. అసలు నిబంధనలు పాటిస్తున్నారా? అనే విషయంలో కూడా స్పష్టత ఉండడం లేదు. ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ ద్వా రా తనిఖీలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఆ యంత్రాల పనితీరుపై తనిఖీలు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అధి కారులు చూస్తున్నారని అంటున్నా.. దానిలో నిజంపై అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. చట్టప్రకారం సుమారు 50 రకాల నిబంధనలను ఫిట్‌నెస్‌ కోసం తనిఖీ చే యాల్సి ఉంటుంది. వాటిలో కొన్నిటిని భౌతి కంగా పూర్తి చేయాలి. కానీ తూతూమంత్ర ంగా కానిచ్చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పైగా గతంలో కొవ్వూరు, రాజమండ్రిలో తనిఖీలు నిర్వహించే వారు. ప్రైవేటు కంపెనీ మాత్రం ఒకే చోట ప్రక్రియ పూర్తిచేస్తోంది. దీంతో వాహనదా రులు ఇబ్బంది పడుతున్నారు.

తల్లిదండ్రుల బాధ్యత ఏంటి?

పిల్లలను ఉదయం స్కూల్‌ బస్సు ఎక్కించడం, సాయంత్రం దించి ఇంటికి తీసుకెళ్లడం ఒకటే తల్లిదండ్రుల బాధ్యత అనుకుంటే పొరబాటే. పిల్లలు ప్రయాణించే బస్సు, డ్రైవరు, కండక్టరు పరిస్థితులు గమనిస్తూ ఉండాలి. బస్సు కండీషన్‌ని పరిశీలిస్తుండాలి. యాజమాన్యం నిబం ధనలు పాటించకపోతే రవాణా, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. డ్రైవర్‌, అటెండర్‌ తీరును గమని స్తుండాలి. వాహనం నడిపే సమయంలో, పిల్లలను ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు బాధ్యతగా ఉన్నాడా? సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారా? బస్సు లో పొగతాగడం, మద్యం తాగి డ్రైవింగ్‌ చేయడం వంటివి చేస్తున్నారా? ముఖ్యంగా విద్యార్థినులతో వారి ప్రవర్తన ఎలా ఉంది? అనేవి రోజూ గమ నిస్తుండాలి. బస్సు సిబ్బంది ప్రవర్తన ఇబ్బందిగా ఉన్నాసరే తల్లిదండ్రులకు భయపడి కొందరు పిల్లలు విషయాలను దాస్తుంటారు. అందువల్ల పిల్లలను ఆరా తీస్తూ ఉండాలి. చాలామంది డ బ్బులు త గ్గుతాయని, బస్సు సదుపాయం లేక పోవడం వంటి కారణాలతో ఆటోల్లో కుక్కినట్లు పంపిస్తుంటారు. దీని వల్ల పిల్లలు స్కూల్‌కి చేరుకునే సమయానికి అలసిపోతారు. పైగా ప్రమాదం కూడా.

ఈ బస్సుల సంగతేంటి..!

ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లాలో చూస్తే తూర్పు గోదావరిలో 1572 స్కూల్‌ బస్సులు ఉండగా 1300, కాకినాడ జిల్లాలో 1200కు 1050, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1203కు 900 బస్సులకు ఫిట్‌నెస్‌ పూర్తయింది. ఇంకా 725 బస్సులకు ఫిట్‌నెస్‌ పూర్తి కాలేదు. ఇవి రోడ్లపై తిరిగితే ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే.

Updated Date - Jun 14 , 2025 | 12:29 AM