నిషేధ సమయంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దు : కలెక్టర్
ABN, Publish Date - Jun 05 , 2025 | 01:38 AM
జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిషేఽధ సమయంలో ఇసు క తవ్వకాలు జరపకూడదని, వాటిపై పర్య వేక్షణ అవసరమని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదే శించారు.
అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక బృందాల తనిఖీలు
సీజ్ చేసిన ఇసుక గృహ నిర్మాణ పనులకు వినియోగం
రాజమహేంద్రవరం, జూన్4 (ఆంధ్రజ్యో తి): జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిషేఽధ సమయంలో ఇసు క తవ్వకాలు జరపకూడదని, వాటిపై పర్య వేక్షణ అవసరమని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదే శించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా స్థాయి డీఎల్‌ఎస్‌ఏ సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఈనెల 1నుంచి సెమీ మెకనైజ్డ్ రీచ్‌ల వద్ద ఇసుక తవ్వకాలు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చామని, ఎవరైనా ఆయా ప్రాంతా ల్లో ఇసుక తవ్వకాలు జరిపితే సంబంఽధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతోపా టు సీజ్ చేసిన వాహనాల నుంచి అపరాధ రుసుమ వసూలు చేయడమే కాకుండా సీజ్‌చేసిన ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద డంప్ చేసి ప్రభుత్వ నిర్మాణ, ఇళ్ల నిర్మాణ పనులకు వినియోగించాలని, వాటిపై నివేదిక కూడా ఇవ్వాలన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విజి లెన్స్ బృంద సభ్యులతో ఆకస్మిక తనిఖీలు, దాడులు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లం ఘించిన ప్రాంతాల్లో సమన్వయ శాఖల అధికారులతో కచ్చితంగా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ఎన్‌జీటీ మార్గదర్శకాలు కచ్చితంగా అమలుచేయాలని, ఎటువంటి మీమాంసకు తావులేదన్నారు. సీజ్ చేసిన ఇసుక ఎక్కడ డంప్ చేశారో వివరాలు చెప్పా లన్నారు. 19 కేసులు నమోదు చేసి, 10 కేసు లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని అధికా రులు చెప్పగా, మిగతా కేసుల విషయంలో ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో వివ రణ ఇవ్వాలన్నారు. ఇక వర్షాకాలం దృష్ట్యా 9 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ పాయిం ట్ల వద్ద డంప్ చేసినట్టు వివరించారు. జేసీ ఎస్. చిన్నరాముడు మాట్లాడుతూ ఇసుక రీచ్ నిర్వహణ, నిషేధ సమయంలో డీ సి ల్టేషన్ అనుమతులు, సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్‌ల వద్ద కార్యకలాపాల్లో ఎటువంటి తవ్వ కాలు జరగకూడదన్నారు. ఆర్డీవోలు ఆర్ కృష్ణ నాయర్, రాణి సుస్మిత, జిల్లా మైన్స్ అధికారి డి. ఫణిభూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 01:38 AM