ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక లారీలతో భయాందోళన చెందుతున్నాం

ABN, Publish Date - May 31 , 2025 | 12:41 AM

ఇసుకలారీల వేగంతో భయాందోళన చెందుతున్నా మని నిరసన తెలిపారు.

ద్రాక్షారామ, మే 30(ఆంధ్రజ్యోతి): ఇసుకలారీల వేగంతో భయాందోళన చెందుతున్నా మని నిరసన తెలిపారు. శుక్రవారం చీమల దిబ్బ వద్ద వేగాయమ్మపేట, వెంకటాయపాలెం సర్పంచ్‌లు, గ్రామస్తులు, రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈసందర్భ ంగా సర్పంచ్‌లు అంబటి తుకారాం, యల్లమల్లి సతీష్‌కుమారి, రైతుకూలీ సంఘం నాయకుడు వెంటపల్లి భీమశంకరం తదితరులు మాట్లాడారు. చీమలదిబ్బ వద్ద ఇసుక లారీలు మితిమీరిన వేగంతో వెళుతుండ టంతో తరచూ ప్రయాణీకులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆరోపించారు. బుధవారం ఒక మహిళ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా కాలువగట్టు ఉండటంతో రోడ్డు కుంగిపోతోందన్నారు. అధికలోడుతో వెళ్లే వాహనాల రాకపోకలను అధికారులు కట్టడి చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో చీమలదిబ్బ గ్రామస్తులు అనుసూరి వెంకటరమణ, ఇళ్ల సత్యనారాయణ, ఇళ్ల గణపతి, కోడి అర్జనుడు, మాజీ ఎంపీటీసీ దడాల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 12:41 AM