దొంగా..పోలీస్!
ABN, Publish Date - Jul 16 , 2025 | 12:55 AM
గోదాట్లో ఏం జరుగుతుందనేది జనమెరిగిన సత్యమే.. అయినా మన అధికారులు మాత్రం దొంగా పోలీస్ ఆటాడేస్తారు.. సమన్వయంతో పనిచేస్తే గోదాట్లో ఇసుకను ఆపలేరా..? కానీ అలా చేయడంలేదు.
ఇష్టానుసారం ఇసుక డ్రెడ్జింగ్
అధికారులకు కానరాదు
పట్టుకున్నా కేసు నమోదు కాదు
అధికారుల మధ్య లేని సమన్వయం
ఆర్‌కే కనుసన్నల్లోనే దందా
అందరికీ మామూళ్లే
(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)
గోదాట్లో ఏం జరుగుతుందనేది జనమెరిగిన సత్యమే.. అయినా మన అధికారులు మాత్రం దొంగా పోలీస్ ఆటాడేస్తారు.. సమన్వయంతో పనిచేస్తే గోదాట్లో ఇసుకను ఆపలేరా..? కానీ అలా చేయడంలేదు.. మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ ఇష్టానుసారం అక్రమార్కులకు అండగా నిలబడుతున్నారు.. అధికార పక్షం నాయకులు వంతపాడుతున్నారు.. వైసీపీ నాయకులతో కుమ్మక్కవుతు న్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. అయినా పట్టుకునేవారెవరు!తెలుగుదేశం ఆధ్వర్యంలో కూటమి ప్రభు త్వం ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఓ చారిత్రక నిర్ణయం తీసుకుంటే.. సొంత పార్టీ నేతలు,అధికారులే దానికి తూట్లు పొడుస్తు న్నారు.వైసీపీ హయాంలో ఇసుకను అక్రమంగా దోచేసిన దొంగలతో కుమ్మక్కవడం మరో ఘో రం. అనధికారికంగా డ్రెడ్జింగ్ బోట్లతో ఇసుక తోడేసి దోపిడీ కొనసాగిస్తున్నారు. ఉద్యోగాల భద్రత గుర్తొచ్చి అప్పుడప్పుడు టాస్క్‌ఫోర్స్ కొన్ని డ్రెడ్జింగ్ పడవలను పట్టుకుంటే.. వాటిని స్వా ధీనం చేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు, కేసులు నమోదు చేయడానికి పోలీసులు వితం డవాదన చేయడం గమనార్హం.ఈ నెల 8వ తేదీ న 5 డ్రెడ్జింగ్ బోట్లను పట్టుకుంటే సోమ వారం కేసు నమోదు చేయడం గమనార్హం.
గోదారిలో బోట్లు ఎన్ని?
గోదావరిలో బోటు దిగాలంటే గతంలో ఇరిగేషన్ అఽధికారులు లైసెన్స్ ఇచ్చేవారు. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో పోర్టు అధికారుల అనుమతి తీసుకోవాలనే నిబంధన పెట్టింది. తనిఖీలు, లైసెన్స్‌ల అధికారం పోర్టుకే ఇచ్చింది. కానీ వాళ్లెవరూ కనీసం తనిఖీలకు రారు. ఎన్ని పడవలకు అనుమతిచ్చారో చెప్పరు. అనధికారి కంగా డ్రెడ్జింగ్ బోట్లు తిరిగేస్తుంటే పట్టించు కోరు. దీంతో గోదావరిలో ఎన్నిబోట్లు ఇసుక తీస్తున్నాయో..అవి ఎవరివో కూడా లెక్కాపత్రం లేదు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న బోట్లు ఇరి గేషన్ ఏఈ కస్టడిలో ఉన్న సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు కేసులు నమోదు
ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు టూటౌన్ పోలీసులకు అక్రమ డ్రెడ్జింగ్ బోట్ల గురించి ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ ఏఈ శివ ప్రసాద్ సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు సీఐ శివగణేష్ తెలిపారు. గాయత్రి ర్యాంపుల్లో దొరికిన ఐదు డ్రెడ్జింగ్ బోట్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. లలితాదేవి బోటులో ఆపరేటర్ ఘంటసాల ఏసు, బాలే రామ్మూర్తిపై కేసు నమోదైంది. శ్రీలక్ష్మీగణపతి వీరచంద్రయ్య డ్రెడ్జింగ్ బోటు యజమానిగా గుంటూరు జిల్లా ధరణికోటకు చెందిన యళ్ల మూడి వెంకటరావు, శ్రీ లక్ష్మీ గణపతి డ్రెడ్జింగ్ బోటు యజమానిగా సీతంపేటకు చెందిన సం గీత వెంకటావు, సద్గురు సాయినాథ్ బోట్ యజమానిగా కొవ్వూరుకు చెందిన కొత్తపల్లి బాలాజీ, శ్రీలక్ష్మీ డ్రెడ్జింగ్ బోటు యజమానిగా యాళ్లమూడి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు అయింది. కోటిలింగాల, కాతేరులో దొరికిన డ్రెడ్జింగ్ బోట్లపై ఇంకా కేసు నమోదు కాలేదు. త్రీటౌన్‌లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఇక్కడ కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు యజమానులు ముందుకొస్తున్నట్టు సమాచారం.
టన్నుల కొద్దీ అవినీతి
ఈ ఇసుక వ్యవహారం అంతా ఆర్కే అనే వ్యక్తి చేతుల మీదుగా జరుగుతుంటుంది. అతని నుంచి ఎవరి వాటా వారికి వెళ్లిపోతుంది. కొం దరు ప్రజాప్రతి నిధులకు 20 టన్నుల లారీకి రూ.3800 వందలు అందుతున్నట్టు ప్రచారం. ఇలా రోజుకు సుమారు 5 లక్షల వరకూ కొం దరికి అందే అవకాశాన్ని సదరు ఆర్కే కల్పిం చినట్టు ప్రచారం ఉంది. 20 టన్నుల లారీకి సుమారు 25 నుంచి 35 టన్నుల వరకూ ఇసుక అదనంగా వేస్తున్నారు. 20 టన్నుల లారీ అంటే 20 టన్నుల ఇసుకకే బిల్లు ఉంటుంది.మిగిలి నది ఎవరికి వారు దండుకుంటున్నారు. అధికలోడు వల్ల రోడ్ల మీద ఇసుక పడిపోవడం, దుమ్ము రేగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
సొసైటీల ముసుగులో డ్రెడ్జింగ్
అఖండ గోదావరిలో డీసిల్టేషన్‌కు ప్రభుత్వ అనుమతి ఉంది. బోట్స్‌మన్ సొసైటీల ద్వారా మాన్యువల్‌గా గోదావరి నుంచి ఇసుక తీయా లి.అందుకు బోట్స్‌మన్ సొసైటీకి టన్నుకు రూ.219 ఇస్తారు.కానీ కొందరు ఇసుక వ్యాపా రులు,ప్రజా ప్రతినిధులు కుమ్మక్కయి,కొందరు అధికారులను గుప్పిట్లో పెట్టుకుని గత వైసీపీ లో ఇసుక అక్రమాలు చేసి రూ.కోట్లు గడిం చిన ఆర్కే అనే వ్యక్తికి మళ్లీ ఇక్కడ పెత్తనం అప్పగించారు. దీంతో బోట్స్‌మన్ సొసైటీల పేరుతో డ్రెడ్జింగ్ మొదలైంది. గుంటూరు, విజ యవాడ, భీమడోలు, విజ్జేశ్వరం ప్రాంతాలకు చెందిన సుమారు 70 డ్రెడ్జింగ్ బోట్లు గోదా వరిలో అక్రమ డ్రెడ్జిం గ్‌కు పాల్పడుతున్నాయి. సుమారు 3 నెలల నుంచి డ్రెడ్జింగ్ చేస్తు న్నారు. సాధారణ బోట్లలో పది యూనిట్ల వరకూ ఇసుక వస్తుంది. ఒక రాత్రి డ్రెడ్జింగ్ చేస్తే వందల టన్నుల ఇసుక వచ్చేస్తుంది. దీనిని తెచ్చి బోట్స్‌మన్ సొసైటీల్లోనే అన్‌లోడ్ చేస్తున్నారు..వారికివ్వాల్సింది వారికిచ్చే స్తున్నా రు.పగటి పూట లంకల్లో లేదా, కొవ్వూరు, గాయత్రి, కోటిలింగాల, కాతేరు ప్రాంతాల్లో డొం కల్లో డ్రెడ్జింగ్ పడవలను తాళ్ల తో కట్టేసి రాత్రికి మళ్లీ డ్రెడ్జింగ్‌కు పాల్పడుతున్నారు.
Updated Date - Jul 16 , 2025 | 12:55 AM