అక్రమాలు.. తవ్వేస్తారు!
ABN, Publish Date - May 25 , 2025 | 01:48 AM
ఇక ఇసుక అక్రమాల వంతు వచ్చింది.. గత వైసీపీ హయాంలో లెక్కలను తవ్వనున్నారు.. నాడు వందల కోట ్ల రూపాయల విలువైన ఇసుకను దోపిడీ చేసిన కీలక నేతల గుండెల్లో గుబులు రేగుతోంది.
వైసీపీలో ఇసుక దోపిడీపై దర్యాప్తు
వందల కోట్ల ఇసుక తరలింపు
ప్రేమ్‌రాజ్ బలవన్మరణంపై ఆరా
సుప్రీం కోర్టుకు తప్పుడు నివేదిక
డ్రెడ్జింగ్ మతలబుపైనా కన్ను
యథేచ్ఛగా సాగిన అక్రమాలు
ఇష్టానుసారంగా అనుమతులు
నాడు సహకరించిన అధికారులు
(రాజమహేంద్రవరం/అమలాపురం- ఆంధ్రజ్యోతి)
ఇక ఇసుక అక్రమాల వంతు వచ్చింది.. గత వైసీపీ హయాంలో లెక్కలను తవ్వనున్నారు.. నాడు వందల కోట ్ల రూపాయల విలువైన ఇసుకను దోపిడీ చేసిన కీలక నేతల గుండెల్లో గుబులు రేగుతోంది.రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమాలపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డ ఇసుక మాఫియా అక్రమాలు వెలుగు చూస్తాయనే ఆందోళన అప్పుడే ప్రారంభమైంది.. నాడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో జిల్లా పర్యటనకు హాజరైన చంద్రబాబు ఆలమూరు మండలం జొన్నాడ వద్ద సెల్ఫీ చాలెంజ్ విసిరారు. ఇప్పుడు సీఎం హోదాలో ఆ అక్రమాలను వెలికితీసే పనిలోపడ్డారు.. వైసీపీ హయాంలో గోదావరిలో జరిగిన ఇసుక దోపిడీపై సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో అప్పటి సర్కారీ పెద్దలతో పాటు ఇసుక దోపిడీలో భాగమైన అధికార, అన ధికారుల వెన్నులో వణుకు మొదలైంది. కొవ్వూ రు, నిడదవోలు, రాజ మహేంద్రవరం, రూరల్, రాజానగరం, రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల పరిధిలోని ర్యాంపుల నుంచి ఐదేళ్ల కాలంలో వందల కోట్లు విలువైన ఖనిజ సంపద దోచుకుపోయారు. నాడు ఏపీఎం డీసీకి అప్పగించినట్టే అప్పగించి వేల కోట్లు దోచుకు న్నారు. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల ఇసుక అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది.నాడు జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో గౌతమి, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయల్లో లభ్యమయ్యే వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా దోచేశారు.
దోపిడీ సాగిందిలా..
ఇసుకలో వైసీపీ దోపిడీ అంతా ఇంతా కాదు.. గోదావరిని జోన్-2, జోన్-3 కింద విభజించి మొదట జేపీ వెంచర్స్‌కు రెండేళ్లకు కాంట్రాక్టు ఇచ్చారు. ఈ సంస్థ ఆన్‌లైన్ లావాదేవీలు చేయ కుండా ఒకే ఒక్క బిల్లు బుక్ పట్టుకుని అక్ర మంగా లక్షలాది టన్నుల ఇసుకను తరలిం చేసింది. 2023 మే నెలలో ఈ సంస్థ కాంట్రాక్టు ముగియడంతో వారిని పక్కన పెట్టి అప్పటి వైసీపీ సర్కారీ పెద్దలు తెరమీదకు వచ్చారు. జేపీ సంస్థ వాడిన బిల్లులనే చూపిస్తూ అనధి కారికంగా మరింత బరితెగించిన సంగతి తెలి సిందే. వీరు ఏకంగా ర్యాంపులన్నింటికీ ఒకే వ్యక్తికి అప్పగించి నెలకు సుమారు రూ.30 కోట్ల వరకూ చెల్లించేలా ఒప్పందం పెట్టుకున్నారు. ఇసుక తవ్వకముందే వారికి డబ్బు ఇచ్చేటట్టు లోపాయికారి ఒప్పందం జరిగింది. కొవ్వూరు డివిజన్‌లోని ర్యాంపులను కొవ్వూరుకు చెందిన వైసీపీ నేత ప్రేమ్‌రాజ్ దక్కించుకుని అప్పుల పాలయ్యాడు. అనంతరం ప్రేమ్‌రాజ్ కొవ్వూరు లో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయనీయలేదు. తాడే పల్లి నుంచి కొందరు పెద్దలు పంపిన వ్యక్తులు వచ్చి ప్రేమ్‌రాజ్ కేసును మూయించేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇవాళ సిట్‌ని నియమించడంతో ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేస్తే ఇసుక కుంభకోణాల డొంక కదలక తప్ప దు. రాజమహేంద్రవరం వైపు ఆర్‌కే అనే వ్యక్తి మొత్తం ర్యాంపులను తీసుకుని సర్కారుకు కప్పం చెల్లించిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని కుంభకోణాలు కోర్టు వరకూ వెళ్లడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. దీనిపై అప్పటి జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తో కూడా తప్పుడు రిపోర్టు ఇప్పించినట్టు ప్రచా రం జరిగింది. గోదావరిలో అక్రమాలపై ధవళే శ్వరం గ్రామానికి చెందిన వంశీ అనే ఇసుక వ్యా పారి కోర్టును ఆశ్రయించడంతో ఎస్పీ ఆఫీసుకు అతన్ని పిలిపించి అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు చుట్టుముట్టి అతని చేత బలవంతంగా ఫిర్యాదు వెనక్కి తీయించడం అప్పట్లో సంచలన మైంది. ఇదంతా తాడేపల్లి పెద్దల ఒత్తిడితోనే జ రిగినట్టు ప్రచారం జరిగింది.
కోర్టును తప్పుదారి పట్టించి..
ఇసుక కుంభకోణాలు, అక్రమాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఇక్కడ అసలు డ్రెడ్జింగ్ అక్రమాలు జరగలేదని, నిబంధనలు ఎవరూ ధిక్కరించలేదని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంస్థ పేరునే డ్రెడ్జింగ్ జరిగినట్టు ఓ బూటకపు నాటకాన్ని తెరమీదకు తేవడం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. అప్పట్లో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాతేరు శివారు వెంకటనగర్ వరకూ, కొవ్వూరు డివిజన్‌లోనూ రాత్రీ పగలూ అనధికారికంగా డ్రెడ్జింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 2023 మే నెల నుంచి వంద లాది డ్రెడ్జింగ్ పడవలతో ఇసుక దోపిడీ జరిగిం ది. 2023 డిసెంబర్‌లో ప్రతిమ సంస్థ పేరుతో రంగంలోకి దిగి డ్రెడ్జింగ్ చేశారు. దీనిని పక్క దారి పట్టించడానికి గతంలో డ్రెడ్జింగ్‌కు అను మతి పొందినా ఇసుక తీయని సంస్థను తెరమీ దకు తెచ్చి నాటకాలాడారు. ఇందులో బోట్స్‌మన్ సొసైటీలను భాగస్వామ్యం చేశారు. ఇలా కోర్టు ను తప్పుదారి పట్టించడమే కాకుండా రూ.వం దల కోట్లు బిల్లులు ఇవ్వాలని తర్వాత ప్రభుత్వా నికి బిల్లులు పెట్టడం గమనార్హం. దీనికి అప్ప టి మైన్స్, ఇరిగేషన్ అధికారులు సహకరించడం, జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తేవడం అందరికీ తెలిసిందే. నాడు బ్రిడ్జిల పక్క నా తవ్వేశారు. ధవళేశ్వరం బ్యారేజి, రోడ్ కం రైలు బ్రిడ్జి, గామన్ వంతెన, హేవలాక్ బ్రిడ్జి ప్రాంతాల్లోనూ యథేచ్ఛగా తవ్వేశారు. గనులు, భూగర్భశాఖకు చెందిన యంత్రాంగం అప్పటి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే పనిచేసింది. మైన్స్ అధికారులు ఎన్ని అక్రమాలు జరిగినా పట్టించుకోలేదు.
నాడు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్
2023ఆగస్టు 17న జొన్నాడలో ఉన్న ఇసుక గుట్టలను చంద్రబాబునాయుడు సందర్శిం చారు. కోనసీమ పర్యటనలో భాగంగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ ఇసుక దోపిడీలో ఎన్ని వందల కోట్లు దోచుకున్నారో లెక్కలతో సహా ఆరోపణాస్ర్తాలు సంధించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఇసుక దోపిడీలో నాటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక పాత్ర వహించినట్టు తేల్చారు. ఇప్పుడు సీఎం హోదాలో లెక్క తేల్చనున్నారు.
వైసీపీలో సిట్ గుబులు..
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎక్కడ ఎంత మేర ఇసుక దోపిడీ జరిగింది. నాటి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందనే అంశంపై లెక్కలు తేల్చి బాధ్యులను గుర్తించేందుకు పోలీసు అధికారులతో ప్రత్యేక సిట్ ఏర్పాటుచేసింది. ఇదిలా ఉండగా కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామమైన గోపాలపురంలో శనివారం వైసీపీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో విందు సమావేశాన్ని నిర్వహించారు. సరిగా అదే సమయానికి ఇసుక అక్రమాలపై సిట్ ఏర్పాటు చేశారన్న సమాచారం తెలుసుకున్న కొందరు నాయకులు ప్రాథమికంగా చర్చించుకున్నట్టు తెలిసింది. మొత్తం మీద జిల్లాలో దోపిడీపై సిట్ ఏర్పాటు అన్న సమాచారం అటు అప్పటి వైసీపీ ప్రతినిధులు, అప్పట్లో కీలకంగా పనిచేసిన పలు శాఖల అధికారుల్లో గుబులు రేపుతోంది.
Updated Date - May 25 , 2025 | 01:48 AM