సామర్లకోట చైర్‌పర్సన్ రాజీనామా లేఖ ఉపసంహరణ
ABN, Publish Date - May 18 , 2025 | 12:44 AM
సామర్లకోట, మే 17 (ఆంధ్రజ్యోతి): తన పదవికి రాజీనామా చేసిన కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్ జీ.అరుణ తన రాజీనామా లేఖ ఉపసంహరించుకుంటున్నట్టు మున్సిపల్ కమి షనర్ శ్రీవిద్యకు శనివారం లేఖ అందజేశారు. ఈనెల 15న కమిషనర్‌కు అందజేసిన రాజీనామా పత్రాన్ని ఉపసంహరించు
సామర్లకోట, మే 17 (ఆంధ్రజ్యోతి): తన పదవికి రాజీనామా చేసిన కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్ జీ.అరుణ తన రాజీనామా లేఖ ఉపసంహరించుకుంటున్నట్టు మున్సిపల్ కమి షనర్ శ్రీవిద్యకు శనివారం లేఖ అందజేశారు. ఈనెల 15న కమిషనర్‌కు అందజేసిన రాజీనామా పత్రాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. అదేరోజు జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో వైసీపీకి చెందిన 25మంది మెజార్టీ కౌన్సిలర్లు చైర్ పర్సన్‌పై అవిశ్వాసం ప్రకటించి నెగ్గిన విషయం విధి తమే. అయితే తాను కోర్టులో చేసిన అభ్యర్థన కోర్టు పరిశీలనలో ఉన్నందున రాజీనామా ఉప సంహరిం చుకుంటున్నట్టు అరుణ తెలిపారు. కాగా కౌన్సిల్‌లో అనిశ్చిత పరిస్థితులపై ఉన్న తాధికారుల లేఖ రాసి నట్టు ఆ మేరకు వెలువడే ఉత్తర్వుల ద్వారా తదు పరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
Updated Date - May 18 , 2025 | 12:44 AM