ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కదలాల్సిందే..

ABN, Publish Date - Jun 19 , 2025 | 12:15 AM

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు శాఖల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యింది. కొన్ని విభాగాల్లో మాత్రం ఇంకా జరుగుతోంది. ప్రస్తుతం సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. గత ఐదేళ్లుగా వీరికి బదిలీలు లేకపో

సచివాలయ సిబ్బంది బదిలీకి రంగం సిద్ధం

ఐదేళ్ల తర్వాత స్థాన చలనం

మార్గదర్శకాలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

ఈనెల 30 నాటికి బదిలీ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు శాఖల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యింది. కొన్ని విభాగాల్లో మాత్రం ఇంకా జరుగుతోంది. ప్రస్తుతం సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. గత ఐదేళ్లుగా వీరికి బదిలీలు లేకపోవడంతో వీరందరినీ కదిపేందుకు కూటమి సర్కారు సంకల్పించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. గతేడాది నవంబతిరులో పరిమిత స్థాయిలో బదిలీలు జరగగా ఇప్పుడు జీవో నంబర్‌ 5 ప్రకారం మొత్తం ఉద్యోగులకు స్థానచలనం కల్పించేలా అవకాశం కల్పించింది.

గతేడాదే అవకాశం...

వాస్తవానికి సచివాలయ ఉద్యోగుల బదిలీలకు గతేడాదే ప్రభుత్వం అవకాశం కల్పించినా మెజారిటీ ఉద్యోగులు బదిలీలకు సిద్ధపడలేదు. దీంతో నామమాత్రంగానే జరిగాయి. చాలామంది ఐదేళ్ల పాటు ఒకే సచివాలయంలో పాతుకుపోయారు. దీంతో ఐదేళ్లపాటు ఒకే సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను వేరే సచివాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగుల వ్యక్తిగత అభ్యర్థనపై బదిలీ అయ్యేందుకు అవకాశం కల్పించింది. అయితే ఉద్యోగులెవరికీ వారి సొంత మండలాలకు బదిలీ అయ్యే వీలు లేకుండే సర్కారు చెక్‌ పెట్టింది. దీం తో ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్కువ జీతంతో పనిచేసే వారికి సొంత ప్రాంతంలో పనిచేసుకునే అవకాశం కల్పిస్తే ఆర్థిక భారం తప్పుతుందని చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో...

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1590 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అందులో 319 వార్డు, 1271 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వీటిలో సుమారు 12 వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. అయితే ఇక్కడ వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బందికి సంబంధించి బదిలీలకు వేర్వేరు మాడ్యూల్స్‌ రూపొందించారు. వార్డు సచివాలయ ఉద్యోగుల బాధ్యత మున్సిపల్‌ కమిషనర్లకు, గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీ బాధ్యత ఎంపీడీవోలకు, జిల్లా పంచాయతీ అధికారులకు అప్పగించారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఏయే ఖాళీలు ఉన్నా యి? ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? సొంత మండలాల్లో పనిచేస్తున్న వారు ఎందరు? ఇలా అందరి సర్వీసు చిట్టాలను పరిశీలిస్తున్నా రు. ఉద్యోగుల ఎంపిక సమయంలో జరిగిన విధంగానే ఉమ్మడి జిల్లాల ఆధారంగా బదిలీల ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ బదిలీలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. జూన్‌ 16 నుంచి 18 వరకు ఖాళీల నమోదు, 22 నుంచి 24 వరకు బదిలీలకు దరఖాస్తులు, జూన్‌ 25 నుంచి 29 వరకు దరఖాస్తుల పరిశీలన, జూన్‌ 30వ తేదీ నాటికి బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది.

Updated Date - Jun 19 , 2025 | 12:15 AM