ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సచివాలయ ఏఎన్‌ఎంలకు రీ వెరిఫికేషన్‌

ABN, Publish Date - Jun 19 , 2025 | 12:17 AM

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)/ జీజీహెచ్‌(కాకినాడ), జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయంలో సచివాలయ ఏఎన్‌ఎంలు నుంచి మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఫిమేల్‌ (ఎంపీహెచ్‌ఏ)(ఎఫ్‌) లుగా పదోన్నతి పొంది గత ఆదివారం కౌన్సిలింగ్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ బు

ఆర్డర్‌ కాపీని అందజేస్తున్న డీఎంహెచ్‌వో

అభ్యర్థులందరికీ ఆర్డర్‌ కాపీలను అందజేసిన కాకినాడ డీఎంహెచ్‌వో

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)/ జీజీహెచ్‌(కాకినాడ), జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయంలో సచివాలయ ఏఎన్‌ఎంలు నుంచి మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఫిమేల్‌ (ఎంపీహెచ్‌ఏ)(ఎఫ్‌) లుగా పదోన్నతి పొంది గత ఆదివారం కౌన్సిలింగ్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ బుధవారం జరిగింది. కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె నరసింహనాయక్‌ ఈ ప్రక్రియను నిర్వహించా రు. ఉమ్మడి జిల్లా నుంచి గతంలో కౌన్సిలింగ్‌కు హాజరై తమ స్థానాలు నిర్దేశించబడ్డ 390 మంది ఏఎన్‌ఎంలు ఈ రీవెరిఫికేషన్‌ ప్రక్రియకు హాజరయ్యారు. తాజా ప్రక్రియలో ఇద్దరు ఏఎన్‌ఎంలు అవకతవకలకు పాల్పడినట్టు వెల్లడయ్యింది. ఆదివారం నిర్వహించిన కౌన్సిలింగ్‌లో వీరు అవ కతవకలకు పాల్పడి బదిలీ ప్రయోజనాలు పొం దారు. ఓ ఏఎన్‌ఎం వివాహిత అయినా కూడా అవివాహితరాలన్న మినహాయింపులో బదిలీ ప్ర యోజనాలు పొందింది. అలాగే మరో ఏఎన్‌ఎం ప్రొహిబిషన్‌ పిరియడ్‌ డిక్లేర్‌ కాకపోయిన అయి పోయిందని బదిలీ దరఖాస్తులో పేర్కొంది. తా జాగా ఈ రెండు విషయాలు వెలుగులోకి వచ్చా యి. వీరిపై చార్జ్‌లు ఫ్రేమ్‌ చేస్తున్నట్టు డీఎంహెచ్‌వో తెలిపారు. కౌన్సిలింగ్‌ ప్రక్రియలో గత ఆది వారం నిర్దేశింపబడ్డ స్థానాల్లోనే కొందరు కొనసాగనుండగా ఇంకొందరికి ఆయా స్థానాల్లో మార్పు లు జరిగాయి. కౌన్సిలింగ్‌ ప్రక్రియ ఉదయం ప్రా రంభమై అర్ధరాత్రి వరకు కొనసాగింది. డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో ఎనిమదిమంది అధికారులు ఈ కౌన్సిలింగ్‌ నిర్వహించారు. రీ వెరిఫికేషన్‌ అనంతరం డీఎంహెచ్‌వో డాక్టర్‌ నాయక్‌ అభ్యర్థులందరికీ ఆర్డర్‌ కాపీలను అందజేశారు. అయితే రీ కౌన్సెలింగ్‌లో అక్రమాలు జరిగాయని పలువురు ఏఎన్‌ఎంలు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jun 19 , 2025 | 12:17 AM