ఉగ్రవాదుల దాడి అత్యంత కిరాతకం
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:36 AM
తుని రూరల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అత్యంత కిరాతకమని తపోవన ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంత సరస్వతి మహాస్వామిజీ అన్నారు. కాకి నాడ జిల్లా తుని మండలంలో గల ఆశ్రమంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం ఏర్పా టు చేసి ఉగ్రదాడి దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై కాల్పులు జరిపి హతమార్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. హిందువులని తెలు
సచ్చిదానంత సరస్వతి మహాస్వామిజీ
తుని రూరల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అత్యంత కిరాతకమని తపోవన ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంత సరస్వతి మహాస్వామిజీ అన్నారు. కాకి నాడ జిల్లా తుని మండలంలో గల ఆశ్రమంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం ఏర్పా టు చేసి ఉగ్రదాడి దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై కాల్పులు జరిపి హతమార్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. హిందువులని తెలుసుకుని చంపడం ఘోరాతి ఘోరమై న అంశమన్నారు. ఇటువంటి చర్యలను అందరూ ఖండించాలని కోరారు. ఉగ్రవాదం భావజాలంతో ఉన్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో శాంతి, సామరస్యమే ఉన్నతమైన వాతావరణాన్ని తీసుకువస్తుందని కానీ ఇలాంటి హింసాత్మక సంఘటనలు ఎటువంటి ప్రభావాన్ని చూపించవని అన్నారు. కేవలం మత పరమైన భావజాలంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం దారుణమైన విషయమని స్వామిజీ చెప్పారు. భారతదేశం మతాలు, వర్గాలకతీతంగా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉగ్రవాదం అం దరికీ ఉమ్మడి శత్రువు అని కేంద్ర నాయకత్వానికి భారతీయుల సంపూర్ణ మద్దతు తెలపాల న్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాదానికి వ్యతిరేకంగా గళంవిప్పేందుకు భారతీయులు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Updated Date - Apr 26 , 2025 | 12:36 AM