ప్రయాణం సా..ఫ్రీగా..
ABN, Publish Date - Aug 01 , 2025 | 01:21 AM
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఉమ్మడి జిల్లాలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అయిదు రకాల బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించేందుకు ప్రభుత్వం గ్రీనసిగ్నల్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫ్రీ ప్రయాణానికి జారీ చేసే జీరో ఫేర్ టికెట్‌ను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఉమ్మడి జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సుల్లో తిరగడానికి ప్రభుత్వం పచ్చజెండా
జీరో ఫేర్ టికెట్‌ను గురువారం ప్రయోగాత్మకంగా విడుదల చేసిన ఆర్టీసీ
టికెట్ జారీపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ప్రారంభం
11 డిపోల పరిధిలో టిమ్ యంత్రాల్లోను సాఫ్ట్‌వేర్ మార్పు పూర్తి
పథకం అమల్లోకి వస్తే ఉమ్మడి జిల్లాలో 38 లక్షల మంది మహిళలకు ప్రయోజనం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఉమ్మడి జిల్లాలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అయిదు రకాల బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించేందుకు ప్రభుత్వం గ్రీనసిగ్నల్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫ్రీ ప్రయాణానికి జారీ చేసే జీరో ఫేర్ టికెట్‌ను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత టికెట్లు ఏవిధంగా జారీ చేయాలనేదానిపై ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల్లో కండక్టర్లు, డ్రైవర్లకు ఆర్టీసీ అధికారులు గురువారం నుంచి శిక్షణ కూడా ప్రారంభించారు.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో అడ్డగోలుగా ఆర్టీసీ చార్జీలను పెంచేసి పేదల నడ్డి విరగ్గొట్టింది. కొద్ది పాటి దూరానికే షాక్‌కొట్టే చార్జీలు వసూలు చేసింది. అటు బయట పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో ప్ర యాణం నరకప్రాయంగా మారింది. దీంతో ఇంటిని నడిపే ఇల్లాలి సంక్షేమం కోసం ఎన్నికలకు ముందు టీడీపీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రకటించిం ది. కూటమిని గెలిపిస్తే జిల్లాలో ఎక్కడ్నించి ఎక్కడికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా పథకం అమలుచేస్తామని హామీనిచ్చింది. ఈనేపథ్యంలో ఈ పథకాన్ని ఈనెల 15 నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే ఫ్రీబస్సు ప్ర యాణం విభజిత జిల్లాకే పరిమితమా.. లేదా ఉమ్మడి జిల్లా వరకు అనుమతిస్తారా? అనే చర్చ జరుగు తున్న తరుణంలో ఏకంగా ప్రభుత్వం మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉమ్మడి జిల్లా స్థానం లో ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు బుధవారం అధికారి కంగా ధ్రువీకరించారు. ఈనేపథ్యంలో మరో రెండు వారాల్లో అమలుకానున్న ఈ పథకానికి గురువారం నుంచి ఉమ్మడి జిల్లాలోని 11ఆర్టీసీ డిపోల్లో అధికా రులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ప్రధానం గా ఫ్రీబస్‌కు సంబంధించి జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఫ్రీ బస్సు ఎక్కిన మహిళలకు ప్రభుత్వం టికెట్ ఇస్తుం ది. కానీ డబ్బులు చెల్లించక్కర్లేదు. టికెట్‌లో మా త్రం ప్రయాణిస్తున్న దూరానికి చార్జీ ఎంత అని కనిపిస్తుంది. అందులోనే ఆ మొత్తం రాష్ట్రప్రభుత్వ రాయితీగా చూపించి, చెల్లించాల్సిన చార్జీ సున్నాగా టికెట్‌లో ఉంటుంది. తద్వారా అసలు ఈ పథకం కింద ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు? అనేది తెలుసుకోవడానికి వీలుగా ఈ టికెట్‌ను ఆర్టీసీ జారీచేయనుంది. దీనికి సంబంధించి గురు వారం నమూనా టికెట్‌ను ఆర్టీసీ తొలిసారిగా విడు దల చేసింది. అయితే పథకం అమలయ్యాక జీరో ఫేర్ టికెట్ ఏవిధంగా కొట్టాలి? అనే దానిపై గురు వారం నుంచి ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల్లోని కం డక్టర్లు, డ్రైవర్లకు ఆర్టీసీ అధికారులు శిక్షణ ప్రారం భించారు. అలాగే ఆయా డిపోల్లోని టికెట్ జారీ యంత్రాల(టిమ్) సాఫ్ట్‌వే ర్‌ను సైతం మార్చే ప్రక్రియ పూర్త యింది. అలాగే పథకం అమలైన తర్వా త బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనుంది. ఈ క్రమంలో మహిళా ప్రయాణికుల పట్ల ఏవిధంగా ప్రవర్తించాలి, ఘర్షణ పడకుండా ఏ విధంగా సంయమనం పాటించాలనే అంశాలపై అన్ని డిపోల్లోని 2,100 మం ది సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు.
Updated Date - Aug 01 , 2025 | 01:21 AM