అటు సిట్టింగ్... ఇటు ఇన్‌కం
ABN, Publish Date - Jul 03 , 2025 | 01:15 AM
కూటమి ప్రభుత్వం వచ్చి కొత్త మద్యం పాలసీ తెచ్చినా.. నాణ్యమైన సరుకు డిపోల నిండా ఉన్నా మద్యం అమ్మకాల్లో ఆదాయం మాత్రం మగతగానే ఉంది.
త్వరలో పర్మిట్ రూమ్‌లు
ఉమ్మడి జిల్లాలో 452 షాపులు
200 రకాల బ్రాండ్లు అందుబాటులో..
ఆదాయం అంతంత మాత్రమే
పర్మిట్ రూంలు లేకపోవడమే కారణం
ప్రతిపాదనల స్థాయిలో కసరత్తు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
కూటమి ప్రభుత్వం వచ్చి కొత్త మద్యం పాలసీ తెచ్చినా.. నాణ్యమైన సరుకు డిపోల నిండా ఉన్నా మద్యం అమ్మకాల్లో ఆదాయం మాత్రం మగతగానే ఉంది. జగన్ జమానాలో పిచ్చి బ్రాండ్లతో ఎంత ఆదాయం వచ్చిందో.. ఇప్పుడు దాదాపు 200 రకాల నాణ్యమైన బ్రాండ్లు ఉన్నా అంతే రాబడి నమోదవుతోంది. బీర్లలో పెరుగు దల కనిపిస్తే ఆ మేరకు మిగతా మద్యం బ్రాం డ్లలో తరుగుదల నమోదవుతోంది. దీంతో ఆదా యం ఆశాజనకంగా ఉండడం లేదు. దీనిపై ప్రభుత్వం విశ్లేషణ చేయగా పర్మిట్‌రూంలు లేక పోవడమే ఒక కారణమని తేలింది. ప్రస్తుతానికి అనధికారిక సిట్టింగ్‌లను చూసీచూడనట్టు వది లేస్తున్నా.. ఆదాయంలో మెరుగుపడడం లేదు. దీంతో త్వరలో పర్మిట్‌రూంలు ఇవ్వడానికి ప్రతి పాదనలు రూపొందిస్తున్నారు. జగన్ హయాం లో ఎన్నికలు ఉంటాయని తెలిసినా.. రెండేళ్లకు బార్‌లకు లైసెన్సు ఫీజును కట్టించుకున్నారు. వీళ్లకు సెప్టెంబరు దాకా గడువుంది. దీంతో కూ టమి ప్రభుత్వం ఏడాది ఆదాయం కోల్పోయింది.
బీర్లు 40 శాతం పెరిగినా..
వైసీపీ ప్రభుత్వంలో బ్రాండెడ్ మందు కావా లంటే గొంతెండిపోయేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీని ఆసాంతం మార్చేసింది. దీంతో జగన్ జమానాలో పారి పోయిన అంతర్జాతీయ కంపెనీలు మళ్లీ అడుగు పెట్టాయి. లోకల్ తయారీకి స్వస్తి చెప్పి ఆయా కంపెనీల ఒరిజినల్ డిస్టిలరీల్లో తయారైన మ ద్యాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. దరిమి లా నాణ్యమైన మద్యం అన్ని షాపుల్లోనూ దొరు కుతోంది. పైగా అధిక ధరలకూ కళ్లెం పడింది. మద్యం వ్యాపారులకు ప్రభుత్వం కమిషనూ పెంచింది. కానీ ఖజానాకు జమ అవుతున్న సొమ్ములో మాత్రం పెరుగుదల కనిపించడం లేదు. ఉదాహరణకు జిల్లాలోని రాజమహేంద్ర వరం డిపోకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో నూ, కూటమి సర్కారులోనూ అంతే ఆదాయం వస్తోంది. వేసవిలో సాధారణంగా బీర్ల అమ్మ కాలు ఏరులై పారతాయి. కానీ ఈసారి ఓ 40 శాతం మేర బీర్ల అమ్మకాల్లో పెరుగుదల కని పించినా.. ఆ మేరకు మిగతా బ్రాండ్ల మద్యం అమ్మకాల్లో తరుగుదల నమోదు కావడంతో రాబడి లెక్కల్లో మార్పు లేకుండా పోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నడుస్తోంది. ఇప్పుడు పర్మిట్‌రూమ్‌లిస్తే ఆదాయం పెరగొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఫ సరుకు ఫుల్..
వైసీపీ హయాంలో జగన్ పిచ్చి మందు అం దుబాటులో ఉండేది. చీప్‌లిక్కరుకు కూడా రూ. 150 లాగేయడం జరిగేది. పైగా ఏరోజు ఏ చిత్ర మైన పేరుతో అందుబాటులో ఉంటుందో తెలి యని పరిస్థితి ఉండేది. డిపోల్లో కూడా నాసి రకం మద్యం మాత్రమే ఉండేది. అది కూడా రేషన్ విధానంలో షాపులకు ఇచ్చేవారు. అయి తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం పాలసీపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయించారు. జగన్ జమానాలో రాష్ట్రం నుంచి పరుగు పెట్టిన ఎంసీ, సియాగ్రమ్స్ వంటి అంతర్జాతీయ కంపెనీలను రప్పించారు. ఇప్పుడు టిన్ బీర్లతోసహా దాదాపు 200 రకాల బ్రాండ్ల సరుకు వస్తోంది. ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నిండా మద్యం ఉంది. కానీ విక్రయాల రాబడి మాత్రం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నట్టే ఇప్పుడూ నమోదవుతూ ఉంది. వైసీపీ ప్రభుత్వంలో నాసి రకం మద్యం రోజుకు ఉమ్మడి తూర్పులో రూ. 10 కోట్ల మేర అమ్మకాలు ఉంటే.. ఇప్పుడు నా ణ్యమైన సరుకు.. 200 రకాల బ్రాండ్లు అందు బాటులో ఉన్నా అంతే విక్రయాలు ఉండడం గమనార్హం. దీంతో మద్యం అమ్మకాల ద్వారా ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఫ ఉమ్మడి జిల్లాలో 452 దుకాణాలు
తూర్పుగోదావరిలో 135, 20 బార్లు.. కాకినాడ జిల్లాలో 171, 13 బార్లు.. కోనసీమ జిల్లాలో 146 మద్యం దుకాణాలు 10 బార్లు ఉన్నాయి. మొ త్తంగా 452 మద్యం షాపులు 43 బార్లు ఉన్నా యి. ప్రభుత్వం బార్లకు మినహా అన్ని షాపుల కూ పర్మిట్‌రూంలు ఇవ్వాలని యోచిస్తోంది. 2019కి ముందు అన్ని షాపులకు ఏడాదికి రూ.5 లక్షలు ఫీజుగా ఉండేది. ఇప్పుడు రెండు కేటగి రీలుగా చేయనున్నారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.7.5లక్షలు, మిగతా ప్రాంతాల్లో రూ. 5 లక్షల ఫీజు విధించే అవకాశం ఉంది. ఉమ్మడి తూర్పులో కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొ రేషన్లు.. మిగతావి మునిసిపాలిటీలు, పంచాయ తీలున్నాయి. పర్మిట్‌రూంల ద్వారా ఏడాదికి ప్ర భుత్వానికి రూ.30 కోట్ల వరకూ జమకానుంది.
పర్మిట్ రూంలు ఇస్తే..
బార్‌లలో అదనపు ధరలు వసూలు చేస్తుండడం, పరిశుభ్రత పట్టించుకోక పోవడం వంటి కారణాలతో మద్యం షాపుల వద్ద తాగేసి వెళ్లడానికి మందుబాబులు మొగ్గు చూపుతున్నారు. అయితే పర్మిట్‌రూంలు లేకపోవడంతో సిట్టింగ్‌కి ఇబ్బందిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో బార్‌లకు లైసెన్సు ఫీజును రెండేళ్లకు జమ చేసుకొంది. వాళ్లకు ఈ సెప్టెంబరు వరకూ సమయం ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చినా రాబడిలో పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దీంతో ఈ సెప్టెంబరు నుంచి పర్మిట్ రూంలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్తగా బార్ పాలసీ కూడా రానుంది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బార్ పాలసీలో మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకున్నారు. అంటే ఆ మండలానికి కేటాయించిన షాపులు మండల పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మండల కేంద్రాల్లో జన సంచారం ఎక్కువగా ఉంటుందని అక్కడే షాపులు పెట్టారు. దీంతో కాస్త పెద్ద గ్రామాల్లో సైతం మద్యం దుకాణం అందుబాటులోకి రాలేదు. ఇది కూడా రాబడిపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇప్పుడు పర్మిట్‌రూంలు ఇవ్వడంతోపాటు మినీ మద్యం షాపులను ఏర్పాటుచేసే యోచన ఉంది.సుఖీభవకు సంసిద్ధం!
Updated Date - Jul 03 , 2025 | 01:15 AM