కన్ను పడితే.. ఇల్లు ఖాళీనే!
ABN, Publish Date - Jun 29 , 2025 | 12:16 AM
కాకినాడ క్రైం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ము గ్గురు కరుడు కట్టిన నేరస్థులు. వారు కన్ను ప డిన ఇల్లు ఖాళీ కావాల్సిందే. ఆ అంతర్ జిల్లా దొంగలు 5 జిల్లాల్లో యఽథేచ్ఛగా 19 నేరాలకు పాల్పడి సుమారు రూ.65 లక్షల విలువైన 582 గ్రాముల బంగారు ఆభరణాలు, 12.500 కిలోల వెండి వస్తువులను అపహరించుకుపోయి జల్సా లు చేస్తూ కాకినాడ జిల్లా పోలీసులకు చిక్కారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావే
ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
రూ.65 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
వివరాలు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్
కాకినాడ క్రైం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ము గ్గురు కరుడు కట్టిన నేరస్థులు. వారు కన్ను ప డిన ఇల్లు ఖాళీ కావాల్సిందే. ఆ అంతర్ జిల్లా దొంగలు 5 జిల్లాల్లో యఽథేచ్ఛగా 19 నేరాలకు పాల్పడి సుమారు రూ.65 లక్షల విలువైన 582 గ్రాముల బంగారు ఆభరణాలు, 12.500 కిలోల వెండి వస్తువులను అపహరించుకుపోయి జల్సా లు చేస్తూ కాకినాడ జిల్లా పోలీసులకు చిక్కారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ జి.బిందుమాధవ్ వెల్లడించారు. ఇటీ వల కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల్లో రాత్రి, పగటిపూట దొంగతనాలు అధికం కావడంతో ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు అడ్మిన్ ఎస్పీ ఎంజెవి భాస్కర్‌రావు పర్యవేక్షణలో కాకినాడ ఎస్‌డీపీవో మనీష్‌దేవరాజ్ పా ఠిల్, కాకినాడ రూరల్ సీఐ డీఎస్.చైతన్యకృష్ణ, క్రైం సీఐ వి.కృష్ణ తమ బృందాలతో కలిసి ఎక్కడికక్కడ నిఘాను పటిష్టం చేశారు. పోలీసులకు ముందుగా వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ చేసే క్రమంలో సాంకేతికత సహాయంతో తాళ్లరేవు మండలం జి.వేమవరం పంచాయితీ వీధిలో నివాసం ఉంటున్న 42 ఏళ్ల బొగడ శ్రీను అలియాస్ బట్టి శ్రీను అతడి స హచరులైన అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన 23 ఏళ్ల పాశి శేఖర్‌ను, అదే ప్రాంతానికి చెందిన ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా తణు కులో ఉంటున్న 24 ఏళ్ల పోతంశెట్టి సూర్యభాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు.
జైల్లో పరిచయం..యథేచ్ఛగా నేరాలు
ఈ విచారణలో బొగడ శ్రీను గతంలో తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 13 నేరాలకు పాల్పడి పామర్రు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక కేసులో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించినట్టు ఎస్పీ వెల్లడించారు. అతడిపై కడి యం పోలీస్‌స్టేషన్‌లో 26-2021గా సస్పెక్ట్ షీట్ ఉన్నట్టు చెప్పారు. అలాగే శేఖర్ గతంలో తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో గతంలో నాలుగు నేరాలకు పాల్పడ్డాడు. సూర్యభాస్కర్‌రెడ్డి గతంలో తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 5 నేరాలకు పాల్పడ్డాడు కాగా తొలుత శేఖర్ సూర్యభాస్కర్‌రెడ్డి తండ్రి వ ద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమం లో అక్కడ ట్రాక్టర్‌ను ఇద్దరు దొంగలించారు. ఆ కేసులో శేఖర్‌తో పాటు సూర్యభాస్కర్‌రెడ్డి జైలు కు వెళ్లారు. జైల్లో వారికి బొగడ శ్రీను పరిచయమయ్యాడు. ఈ ముగ్గురు బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే అప్పటికే సూర్యభాస్కర్‌రెడ్డి, శేఖర్‌పై అనపర్తి పోలీసులు నిఘా పెట్టారు. బొగడ శ్రీనుపై కడియం పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ తెరవడంలో అక్కడ నుంచి ఆలమూరుకు మకాం మార్చాడు. అక్కడ చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని ఆ ముసుగులో దొంగతనాలు చేసేవా డు. తన నిజస్వరూపం తెలిసిపోతుందని తాళ ్లరేవు మండలం జివేమవరానికి మకాం మార్చి స్నేహితులతో కలిసి నేరాలకు పాల్పడేవాడు.
పలు జిల్లాలో 19 నేరాలు...
అలా వారు కాకినాడ జిల్లాలో కరప, గొల్లపాలెం, కోరింగ, సర్పవరం పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 10 దొంగతనాలు... అంబేడ్కర్ కోనసీమ జి ల్లా ద్రాక్షారామ, రాయవరం పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 2 నేరాలు... తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పెరవలి, బిక్కవోలు, అనపర్తి పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 4 నేరాలు.. పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇరగవరం, పెంటపాడు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 2 నేరాలు, ఏలూరులోని చేబ్రోలు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక నేరం మొత్తంగా 19 ఇళ్ల నేరాలకు పాల్పడినట్టు ఎస్పీ వెల్లడించారు. నిందితులను కాకినాడ 7వ స్పెషల్ ఏజెఎఫ్‌సిఎం అండ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సీఐ చైతన్య కృష్ణ, గొల్లపాలెం ఎస్‌ఐ ఎం.మోహన్‌కుమార్, కరప ఎస్‌ఐ టి.సునీత, హెచ్‌సీలు గొప్పు నరసింగరావు (చిన్నా), సీ.నారాయణరెడ్డి, పీసీలు చంద్రశేఖర్, శివప్రసాద్, ఫణీంద్ర, సురేష్‌కుమార్, రమణ, ఎన్ శ్రీనివాసరావులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో అడ్మిన్ ఎస్పీ ఎంజెవి భాస్కర్‌రావు, ఎస్‌బీ డీఎస్పీ సీహెచ్ శ్రీరామకోటేశ్వరరావు, సీఐలు అంకబాబు, వి.కృష్ణ ఉన్నారు.
Updated Date - Jun 29 , 2025 | 12:16 AM