ఇప్పనపాడులో భారీ చోరీ
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:32 AM
మండపేట, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పన పాడులో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెం దిన నీలాటి అదినారాయణ, భార్య సూర్య కుమారితో కలిసి ఈనెల 19న హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లారు. మంగళవారం ఇంటికి వచ్చేసరికి తాళాలు బద్దలుగొట్టి ఉన్నట్టు గుర్తించారు. ఇం
రూ.9.5 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం అపహరణ
మండపేట, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పన పాడులో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెం దిన నీలాటి అదినారాయణ, భార్య సూర్య కుమారితో కలిసి ఈనెల 19న హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లారు. మంగళవారం ఇంటికి వచ్చేసరికి తాళాలు బద్దలుగొట్టి ఉన్నట్టు గుర్తించారు. ఇంటిలో ఉంచిన రూ.9.5 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం దోచుకు పోయారని బాధితులు మండపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్రపురం ఇన్‌చార్జి డీఎస్పీ ప్రసాద్, మండపేట రూరల్ సీఐ పి.దొర్రాజు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని చిందర వం దరగా పడి ఉన్న సామాన్లను పరిశీలించారు. ఇంట్లోని బీరువా లాకర్‌లు మూడు ఉండగా, వాటిలో ఒకటి మాత్రమే దొంగలు బద్దలుగొట్టి నగదు, బంగారం కాజేశారు. మిగిలిన రెండు లాకర్లను ఇంటి యజమాని తెరిచి చూడగా వాటిల్లోని 160 గ్రాముల బంగారంతో పాటు రూ.1.5 లక్షల నగదు సురక్షితంగా ఉన్నాయని తెలిపాడు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని రూరల్ ఎస్‌ఐ వి.కిషోర్ పేర్కొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 12:32 AM