ధాన్యలక్ష్మి ఆలయంలో చోరీ
ABN, Publish Date - Jul 14 , 2025 | 12:35 AM
కె.గంగవరం, జూలై 13 (ఆంధ్ర జ్యోతి): కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరం- కోటిపల్లి ప్రధాన రహదారిలో కోట పరిధిలో ఉన్న కోట ధాన్యలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం వెనుక భాగాన గోడకు కన్నం పెట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆల యంలో ఉన్న 4 సీసీ కెమెరాలను ధ్వం సం చేశారు. అమ్మ
అమ్మవారి మెడలో నోట్ల దండ, 2 కాసుల బంగారం, రూ.10వేలు అపహరణ
కె.గంగవరం, జూలై 13 (ఆంధ్ర జ్యోతి): కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరం- కోటిపల్లి ప్రధాన రహదారిలో కోట పరిధిలో ఉన్న కోట ధాన్యలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం వెనుక భాగాన గోడకు కన్నం పెట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆల యంలో ఉన్న 4 సీసీ కెమెరాలను ధ్వం సం చేశారు. అమ్మవారి మెడలో రూ.4 వేలు విలువ చేసే నోట్లతో తయారు చేసిన దండ, రూ.10 వేలు, 2 కాసుల బంగారు ఆభర ణాలు దొంగిలించుకుపోయారు. హుండీని బద్దలు కొట్టారు. ఐతే హుండీలో డబ్బులు ఇదివరకే తీసి వేయడం వల్ల ఏమీ దొరక లేదు. రామచంద్రపురం డీఎస్పీ రఘు వీర్, సీఐ వెంకటనారాయణ చోరీ ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ. ఎస్‌కె.జానీబాషా పేర్కొన్నారు.
Updated Date - Jul 14 , 2025 | 12:35 AM