దారి కాచి దొంగతనం
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:47 AM
బిక్కవోలు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో దారి కాచి దొంగతనం చేసి న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ బి.విద్య తెలిపారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ, అనపర్తి సీఐ సుమంత్ విలేకర్ల సమావేశం నిర్వహించి వి వరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మా ట్లాడుతూ ఊలపల్లికి చెం దిన కరుపోతు వరప్రసాద్ గోకవరం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నా డు. ఈనెల 17న అర్ధరాత్రి విధులు ముగిం
ఎనిమిది మంది అరెస్టు
నిందితుల్లో నలుగురు మైనర్లు
మూడు మోటార్‌సైకిళ్లు, సెల్‌ఫోన్ స్వాధీనం
బిక్కవోలు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో దారి కాచి దొంగతనం చేసి న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ బి.విద్య తెలిపారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ, అనపర్తి సీఐ సుమంత్ విలేకర్ల సమావేశం నిర్వహించి వి వరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మా ట్లాడుతూ ఊలపల్లికి చెం దిన కరుపోతు వరప్రసాద్ గోకవరం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నా డు. ఈనెల 17న అర్ధరాత్రి విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా బలభద్రపురం ప్లైఓవర్ బ్రిడ్జిపైకి వచ్చేసరికి రాజానగరం వైపు 3 బైక్‌లపై వెళ్తున్న ఎనిమిది మంది అడ్డగించి భయభ్రాంతులకు గురి చేసి అతడి వద్ద ఉన్న రూ.1550 నగదు, సెల్‌ఫోన్ లాక్కుని పోయా రు. దీంతో వరప్రసాద్ 112కు ఫోన్ చేయగా బిక్కవోలు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి అతడి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. దీంతో సీఐ సుమంత్, ఎస్‌ఐ రవిచంద్రకుమార్, సిబ్బందితో దర్యాప్తు జరిపి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని డీఎస్పీ తెలిపారు. రిమాండ్‌కు పంపిన వారిలో బిక్కవోలు మం డలం ఊలపల్లికి చెందిన బదిరెడ్డి శ్రీసాయి, ఖండవిల్లి సాయి, రాయవరం మండలం వె దురుపాక సావరం గ్రామానికి చెందిన మేడిశెట్టి కుమార్, కురుపూడి అభిలాష్, నలుగురు బాల నేరస్తులు ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి మూడు మోటార్‌సైకిళ్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారని వివరించారు.
Updated Date - Jul 22 , 2025 | 12:47 AM