ఆనందం ఆవిరైంది!
ABN, Publish Date - May 27 , 2025 | 12:56 AM
చనిపో యిన తమ కుమార్తెను మనవడు..మనవ రాలిలో చూసుకుంటూ జీవిస్తున్నారు.. తల్లిదం డ్రులు లేని లోటు లేకుండా చూసుకుం టు న్నారు. జీవితం సాఫీగా సాగిపోతోంది.. విధి కన్నుకుట్టిందో ఏమో ఆ ఇద్దరినీ అనాథలను చేసింది..క్షణకాలంలో ముంచుకొచ్చిన మృత్యువు నలుగురు ప్రాణాలను బలితీసుకుంది. మరొక రు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
పుట్టినరోజును ఆనందంగా గడుపుదామని వెళుతూ మృత్యువాత
కారును ఢీకొట్టిన లారీ
నలుగురు మృత్యువాత
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
మనవరాలి పుట్టినరోజునే ఘటన
పుట్టినరోజునాడే భార్య మృతి
భర్త పరిస్థితి విషమం
చాగల్లులో విషాదఛాయలు
ఆదుకుంటామన్న నాయకులు
రాజమహేంద్రవరం/అర్బన్/చాగల్లు/కొవ్వూరు/రాజానగరం, మే 26 (ఆంధ్రజ్యోతి): చనిపో యిన తమ కుమార్తెను మనవడు..మనవ రాలిలో చూసుకుంటూ జీవిస్తున్నారు.. తల్లిదం డ్రులు లేని లోటు లేకుండా చూసుకుం టు న్నారు. జీవితం సాఫీగా సాగిపోతోంది.. విధి కన్నుకుట్టిందో ఏమో ఆ ఇద్దరినీ అనాథలను చేసింది..క్షణకాలంలో ముంచుకొచ్చిన మృత్యువు నలుగురు ప్రాణాలను బలితీసుకుంది. మరొక రు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. మనవరాలి పుట్టినరోజుకని కారులో ఆనందం బయలు దేరిన ఆ కుటుంబం అంతలోనే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చాగల్లు మండ లం మార్కొండపాడుకు చెందిన ఉప్పులూరి వరప్రసాద్ గేదేలను పెంచుతూ,హైచర్ వ్యాన్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. వరప్రసాద్ కు మార్తె గత రెండేళ్ల కిందట విద్యుదాఘాతంతో మృతిచెందింది. దీంతో మనవరాలు పూజా భువనేశ్వరి, మనవడు శంకర్‌ని తమ వద్ద ఉంచుకుని చదివిస్తున్నారు. ఇదిలా ఉండగా నెలన్నర కిందట ఉప్పులూరి వరప్రసాద్ (60), భార్య శివ లీలావతి(56), లీలావతి తల్లి ఇమ్మాని వీరవెంకట సత్యవతి (75) కొవ్వూరు జూనియర్ కళాశాల సమీపంలోని సిటీ కేబుల్ పక్కన ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నా రు. చాగల్లు మండలం దారవరం గ్రామానికి చెందిన లక్కంసాని సురేశ్ అవంతి ఫీడ్స్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ భార్య బిందు(34)తో అదే ఇంట్లో ఒక వాటాలో ఉం టున్నారు. సురేశ్, బిందు దంపతులకు పెళ్లై ఏడేళ్లయినా పిల్లలు లేరు. దీంతో ఇరు కుటుం బాలు దగ్గరయ్యాయి.కాకినాడలో ఇంజ నీరింగ్ చదువుతున్న ప్రసాద్ మనవరాలు భువనేశ్వరి పుట్టిన రోజు సోమవారం కావడంతో వెళదా మని అనుకున్నారు. ఈ మేరకు పక్క వాటాలో ఉం టున్న సురేష్ తన స్నేహితుడు సత్యనారా యణ వద్ద నుంచి డిజైర్ షిఫ్ట్ కారు తీసుకు రాగా ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి ఐదుగురూ బయలుదేరారు. గామన్ బ్రిడ్జి రోడ్డుపై 9.30 గంటల సమయంలో రవాణా శాఖాధికారులు సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండడం గమనించిన డ్రైవర్ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో అవతల లేన్‌లో వస్తున్న బొగ్గులోడు లారీ డివైడర్ మార్గం నుంచి దారి మళ్లించినట్టుగా సమాచారం.అదే సమయంలో ఇవతల వైపు లేనులో వెళుతున్న కారును మధ్యలో ఢీకొట్టి రోడ్డు కిందకు నెట్టుకు పోయింది. వెనుక ఉన్న చెట్టుకు లారీకి మధ్య కారు ఉండిపోయి ఇంజన్ భాగం నుజ్జునుజ్జ యింది. వరప్రసాద్ గుండెలకు స్టీరింగ్ బల ంగా నొక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వెనుక సీట్లో కూర్చున ముగ్గురూ మహిళలు నలిగి పోయారు. డోర్లను బలవంతంగా లాగి వాళ్లను బయటకు తీశారు. కారు లోపల అంతా రక్తమ డుగులా మారిపోయింది. బ్యాగ్ లోని భోజ నం, డిక్కీలోని పిండి వంటలు ఉన్నాయి.
పుట్టినరోజు నాడే..
ఈ దుర్ఘటనలో మరణించిన లక్కంసాని బిందు తన పుట్టిన రోజు నాడే మృత్యువాత పడడం కుటుంబ సభ్యులతో పాటు అందరినీ కలచివేసింది. కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేని బిందు తండ్రి శ్రీనివాస్ ఆసుపత్రి ఆవరణలోని పోలీస్ అవుట్‌పోస్టు ఎదుట విలపించారు. పుట్టినరోజు నాడే ఇలా జరగడం తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రగాయపడిన భర్త లక్కంసాని సురేష్ రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. రోడ్డు ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే లక్కంసాని సురేష్ కుటుంబీకులు ప్రభుత్వ బోధనాసుపత్రికి చేరుకున్నారు. మృతురాలి సోదరుడు రాజేష్, తండ్రి శ్రీనివాస్, అత్త పద్మ, ఇతర బంధుమిత్రులు ఆసుపత్రికి తరలివచ్చారు. పోస్టుమార్టంనకు సంబంధించిన ఇతర లాంఛనాలు పూర్తి చేసుకున్నారు.మిగిలిన మృతుల కుటుంబ సభ్యులెవరూ సాయంత్రం వరకూ ఆసుపత్రికి చేరుకోలేకపోయారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత, పోలీసు శవ పంచనామా పూర్తి చేసేంత వరకూ మృతదేహాలను ఆసుపత్రి మార్చురీ ఎదుట అంబులెన్సుల్లోనే ఉంచారు. పోలీసు నివేదిక అందిన తర్వాతే ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్యులు మృతదేహాలను మార్చురీకి తరలించి పోస్టుమార్టం చేశారు.దీంతో చాగల్లు మండలం దారవరం, మా ర్కొండపాడు గ్రామాల్లో విషాదఛాయలు అలు ముకున్నాయి. కుటుంబీకులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు.ప్రమాద సమా చారం అందుకున్న అధికారులు ఆర్టీవో సురేష్, డీఎస్పీ శ్రీకాంత్, రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్య గౌడ్, తహశీల్దార్ జి.అనంతలక్ష్మి సత్యవతి దేవి, ఎస్‌ఐలు మనోహర్, నాగార్జున, ఎంవీఐ రవికుమార్ హుటాహుటీన సంఘ టనా స్ధలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కు పోయిన మృతులను, క్షతగాత్రులను బయటకు తీసి సహాయక చర్యలు చేపట్టారు.మృత దేహా లని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేం ద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీ సులు డ్రైవర్‌ను అదుపులోని తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
అనాథలుగా ఇద్దరు పిల్లలు
చిన్నప్పుడే తల్లి మరణం. తర్వాత తండ్రి వేరొక పెళ్లితో దూరం. ఇప్పుడు ఆసరాగా ఉన్న తాత, అమ్మమ్మను కూడా మృత్యువు తీసుకు పోగా పిల్లల పరిస్థితి దయనీయంగా మారిం ది.లీలావతి కూతురు భవానీకి భువనేశ్వరి, శంకర్ ఇద్దరు పిల్లలున్నారు. వీళ్ల చిన్నప్పుడే తల్లి చనిపోగా తండ్రి వేరొక పెళ్లి చేసుకొని వెళ్లిపోయాడు.దీంతో భువనేశ్వరి,శంకర్‌ను తాత య్య అక్కున చేర్చుకున్నాడు. శంకర్ దాతల ఆర్థిక సాయంతో చదువుతున్నాడు. భువనేశ్వరి కాకినాడలో బీటెక్ చదువుతోంది. మంత్రులు కందుల దుర్గేష్, మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు సంఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధి తులను ఆదుకుంటామని తెలిపారు. పిల్లల చదువులకు సహాయం చేస్తామని పేర్కొన్నారు.
Updated Date - May 27 , 2025 | 12:56 AM